ఇ-సేవల్లో మేటి

ఇ-సేవల్లో మేటి
December 11 21:23 2017
వరంగల్‌,
వరంగల్‌ పురపాలక శాఖలో వివిధ కార్యకలాపాలు ఆన్‌లైన్‌ ద్వారా సాగిపోతున్నాయి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ విధానాన్ని విస్తృతం చేయడంతో అనేక పనులు నిమిషాల్లోనే ముగిసిపోతున్నాయి. దీంతో తమ సమయం ఆదా అవుతోందని, ఇంతకు ముందులా ఆఫీసుల చుట్టూ తిరగడం, గంటల తరబడి వేచి ఉండడం లాంటివాటికి చెక్ పడిందని అంటున్నారు. నగరవాసులకు పారదర్శక, సులభతర సేవలు అందించేందుకే కార్పోరేషన్ పరిధిలోని సేవలన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది అధికార యంత్రాంగం. గత ఏప్రిల్‌ నుంచి గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ప్రారంభించారు. ఫలితంగా ఆన్‌లైన్‌ ద్వారా ట్రేడ్‌ లైసెన్సు, నల్ల కనెక్షన్లు, ఆస్తి పన్ను సెల్ఫ్‌ అసెస్‌మెంటు, వీఎల్‌టీ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, ప్రకటనల బోర్డులు, ఆస్తిపేరు మార్పిడిలు, ఆన్‌లైన్‌ బిల్డింగ్‌ ఆఫ్లికేషన్‌ తదితర సేవలు అందుబాటులోకి వచ్చాయి. పనితీరును వారానికోసారి వింగ్‌ అధికారులు సమీక్షిస్తున్నారు. నెలరోజులకోసారి కమిషనర్‌ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంన్నారు.
ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సేవలన్నీ ఇంటర్నెట్ ద్వారానే జరిగిపోతాయి. ఇంట్లో ఉండే ఈ సేవలు పొందే అవకాశం ఉంది. బల్దియా, కాశీబుగ్గ, కాజీపేట సర్కిల్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. అర్జీల తాజా పరిస్థితిని సులువుగా తెలుసుకోవచ్చు. రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు జారీ చేసిన సిటిజన్‌ ఛార్టర్‌ నిబంధనలు, గడువు ప్రకారం దస్త్రాలు, అర్జీలు పరిష్కరిస్తారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఇప్పటికే పౌరులు మెరుగైన సేవలు అందుకుంటున్నారు. ఈ అవకాశం లేనప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడమే గాక గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందులు తొలగిపోయాయని నగరవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇ-సేవలు విస్తృతం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇ-సేవలు మరింతగా విస్తృతం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈవోడీబీ విధానం అమలు చేశామని, మరిన్ని ఆధునిక సేవలందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11555
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author