ఏపీకి కేంద్రం..మళ్లీ మొండిచేయి

ఏపీకి కేంద్రం..మళ్లీ మొండిచేయి
December 12 12:40 2017
విజయవాడ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. ప్యాకేజి సరిగా లేదు. విభజన హామీలు అమలు చేయడం లేదు. కనీసం మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్లు అయినా ప్రభుత్వ పథకంలో నిధులు ఇస్తుందా అంటే అదీ లేదు. పోలవరం విషయంలో కొర్రీలు పెడుతోంది. ఇప్పుడు గృహ నిర్మాణ రంగానికి కేటాయింపులు అలానే ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ కు ఇళ్ల కేటాయింపుల్లో కేంద్రం అన్యాయం చేస్తోంది. కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కేంద్ర పధకాల కింద ఇళ్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. గ్రామీణ పేదల కోసం పక్కా ఇళ్ల కేటాయింపుల్లో ఏపీకి నామ మాత్రంగాను మంజూరు చేయడం లేదు. తెలంగాణపైనా కేంద్రం ఇలానే వివక్ష చూపుతోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరుగా విభజించి ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. 2016-17, 2017-18లకు గాను పీఎంఏవై-గ్రామీణ్‌ కింద ఏపీలోని గ్రామీణ పేదలకు 1,23,112 ఇళ్లు కేటాయించారు. అందులో తెలంగాణకు దక్కినవి కేవలం 70,674 ఇళ్లు. ఇక బిహార్‌కు ఏకంగా 11,76,617 ఇళ్లు కేటాయించారు. ఆ తర్వాత వరుసలో యూపీకి 9,71,852 ఇళ్లు రాగా… మధ్యప్రదేశ్‌కు 8,37,679 ఇళ్లు, పశ్చిమబెంగాల్‌కు 8,11,141 ఇళ్లు కేటాయించారు. ఏపీ కంటే పెద్ద రాష్ర్టాలు అని ఆలోచించవచ్చు. కానీ ఛత్తీస్ గఢ్‌కు 4,39,275 ఇళ్లు, ఒడిసాకు 7,36,600 ఇళ్లు కేటాయించి ఏపీ, తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారనేది ఆసక్తికరం. ఇదంతా కావాలని కేంద్రం ఆడుతున్న నాటకంలా ఉంది. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే ఈ పని చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే చేసింది. తెలుగు రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తే కష్టమని భావించి సోనియాగాంధీ రాష్ట్రాన్ని రెండుముక్కలు చేశారనే వాదనుంది. ఇప్పుడు బీజేపీ ఆ రెండు రాష్ట్రాలకు కేటాయింపులులేకుండా అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11605
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
AP
  Categories:
view more articles

About Article Author