టీఆర్ఎస్ పార్టీలోకి ఉమా మాధవరెడ్డి

టీఆర్ఎస్ పార్టీలోకి ఉమా మాధవరెడ్డి
December 12 21:45 2017
హైదరాబాద్,
మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. వారు ఈనెల14వతేదీన టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. రాష్ర్టాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలని తన మనోగతాన్ని సందీప్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14న మధ్యాహ్నం 12గంటలకు తన అనుచరులతో కలిసి ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.కాగా… తెలుగుదేశం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఉమా మాధవరెడ్డి… టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే ఊహగానాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఊహాగానాలను నిజం చేస్తూ14వతేదీన తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. టీ టీడీపీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి టీడీపీ నుంచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11690
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author