సాంకేతికతను పూర్తిగా ఉపయోగిద్దాం

సాంకేతికతను పూర్తిగా ఉపయోగిద్దాం
December 12 22:12 2017
అమరావతి,
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వస్తున్న అభ్యంతరాలకు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సింది ప్రధానే అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు అయన మంత్రులు, శాఖాధిపతులతో  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోలవరంపై సుప్రీంకోర్టుకు ఒడిశా సర్కార్‌ రాసిన లేఖపై సీఎం ప్రస్తావించారు. ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటామని ఒడిశా సర్కార్‌ సూచిస్తోందన్న అధికారులు చంద్రబాబుకు వివరించారు. పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త ట్విస్ట్‌ అని చంద్రబాబు కామెంట్‌ చేశారు. సీఎంల సమావేశం ఏర్పాటు చేయాల్సింది ప్రధానేనని, కేంద్రం సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తే మనకూ మంచిదేనన్న చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం ప్రస్తుతం సైలెంట్‌ అయ్యారని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ భేటీ కలెక్టర్ల సదస్సుకు ఇది సన్నాహక సమావేశం అన్నారు. అలాగే సాంకేతికతను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకుంటున్నామన్నారు. అలాగే జక్కంపూడి ఎకనామిక్ సిటీ రోల్ మోడల్ ప్రాజెక్టు అని, హౌసింగ్, ఎకనమిక్ సిటీ సంయుక్తంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు.
అలాగే, జనవరి 24న రథసప్తమి రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి  వెల్లడించారు. మన రాష్ట్రం  సూర్యోదయ రాష్ట్రం అన్నారు. సూర్యుడిని ఆరాధించడం అంటే సూర్యశక్తిని మరింత సమర్ధంగా వినియోగించుకునేందుకు సంపూర్ణ దృష్టి పెట్టడమేనన్నారు. రథసప్తమి రోజున జరిగే ఉత్సవాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని చంద్రబాబు కోరారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11696
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author