లగడపాటి సర్వేలో టీడీపీకి మార్కులు

లగడపాటి సర్వేలో టీడీపీకి మార్కులు
December 13 09:58 2017
విజయవాడ,
67 ఏళ్ల చంద్రబాబు ఛరిష్మా, ఆయన అభివృద్ధి నమూన, హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌ రాష్ట్ర ప్రజలను మెప్పించాయి. 2018 డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే మరోమారు ఆయనకు పట్టాభిషేకం ఖాయం అని ఓటర్లు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్ ప్రభంజనం తప్పదని కీలక సర్వే వెల్లడించింది. నంద్యాల, కాకినాడల్లో వచ్చిన 56శాతం ఓట్లు కంటే మరో శాతం అధికంగా వస్తుందని వెల్లడించింది. తెదేపా 57శాతం ఓట్లతో 139 సీట్లలో, వైసీపీ 24శాతం ఓట్లతో 28సీట్లు, జనసేన 10శాతం ఓట్లతో 9సీట్లు వస్తాయని లగడపాటి సర్వే కచ్చితంగా చెబుతోంది.దేశంలోనే అత్యంత పలుకుబడి, విశ్వసనీయత కలిగిన సంస్థతో ఈ సర్వే చేయించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాకుండా దేశంలో అందరూ విశ్వసించే మాజీ ఎంపీకి చెందిన సంస్థ బృందం 200 మంది నంద్యాల ఎన్నికలకు ముందు రంగంలోకి దిగారు. నంద్యాల, కాకినాడ సర్వేలు పూర్తి చేసి పంపించాక తమ అసలు ఆపరేషన్‌ మొదలుపెట్టారు.ఢిల్లీ, నోయిడా నుంచి వచ్చిన ఆ సర్వే టీమ్స్‌ రాష్ట్రంలోని 13 జిల్లాలు తిరిగి నియోజకవర్గానికి వేయిమంది చొప్పున శాంపుల్స్‌ సేకరించాయి. 20 ప్రశ్నలతో కూడిన ఫార్మెట్‌ రూపొందించాయి. సర్వేలో వయస్సుల వారీగా, ప్రాంతాల వారీగా, విదార్హతల వారీగా డేటాను ప్రిపేర్ చేశారు. ఆయా సామాజికవర్గాలు గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ వారీగా నివేదికలు అందచేశారు. వీటి ఆధారంగానే సీఎం టీడీపీ వర్క్‌షాపులో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
టీడీపీ+ 57 %
వైసీపీ 24%
జనసేన+% 10
కాంగ్రెస్‌ 4%
ఇప్పుడే ఎవరికి వేసేది చెప్పలేం 5%
రాయలసీమలో 52 స్థానాల్లో
తెలుగుదేశం 41 వైసీపీ 10, జనసేన 1
చిత్తూరు (14) తెదేపా 11, వైసీపీ 3
కడప (10) తెదేపా 7, వైసీపీ 3
అనంతపురం (14) తెదేపా 11, వైసీపీ 2, జనసేన 1
కర్నూలు (14) తెదేపా 12, వైసీపీ 2
ఉత్తరాంధ్ర సర్వే ఫలితాలు
ఉత్తరాంథ్రలోని మొత్తం 33సీట్లలో తెదేపా 24,వైసీపీ 8, జనసేన 1
శ్రీకాకుళం (10 ) తెదేపా 7, వైసీపీ 3
విజయనగరం ( 9) తెదేపా 6, వైసీపీ 3
విశాఖ జిల్లాలో (14) తెదేపా 11, వైసీపీ 2, జనసేన 1
కోస్తా జిల్లాల్లో వారీగా బలాబలాలు
కోస్తాంధ్రలో మొత్తం 89 సీట్లలో తెదేపా 72, వైసీపీ 10, జనసేన 7
తూ.గో (19) టీడీపీ 14, వైసీపీ 2, జనసేన 3
ప,గో (15) టీడీపీ 12, వైసీపీ 1, జనసేన 2
కృష్ణా (16) టీడీపీ 14, వైసీపీ 1, జనసేన 1
గుంటూరు (17) టీడీపీ 15, వైసీపీ 2
ప్రకాశం (12) టీడీపీ 9, వైసీపీ 2 జనసేన 1
నెల్లూరు (10) టీడీపీ 8, వైసీపీ 2
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11702
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author