టీ కాంగ్రెస్ లో తారాస్థాయికి విభేధాలు

టీ కాంగ్రెస్ లో తారాస్థాయికి విభేధాలు
December 13 13:50 2017
హైద్రాబాద్,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.పాలు-నీళ్ళు లా కలిసి ఉండాల్సిన ఆ నేతలు ఉప్పు-నిప్పులా మారారు.ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో ఈ నేతల తీరుపై ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఇంతకు ఆ నేతలెవరు? వారి మధ్య వైరానికి కారణమేంటి?వాచ్ దిస్ స్టోరీ.తెలంగాణ ప్రత్యెక రాష్ట్రం ఇచ్చినా..గత ఎన్నికల్లో పార్టీ ఓట‌మి పాల‌వ్వ‌టం తో రాష్ట్ర కాంగ్రెస్ పై సీరియస్ గా దృష్టి సారించి  పీసీసీ ఛీఫ్ గా ఉత్తం కుమార్ రెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ గా బట్టీ విక్రమార్క లకు భాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే హైక‌మాండ్ ఆశ‌లు మున్నాళ్ళ ముచ్చ‌ట‌గా మారింది. వాస్తవానికి బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య పార్టీ భాధ్యతల విషయంలో తగాదాలు వచ్చాయి.తనని పట్టించుకోకుండా,తనతో ఆంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ తీరు పై బట్టి హైకమాండ్ కి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగానే బట్టి విక్రమార్క కు పార్టీ అనుబంధ‌ విభాగాలైన ఎస్సీ,ఎస్టీ, మెనార్టీ, సేవాదల్ వంటి విభాగాలను ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌ల‌కు ప‌రిమితం చేసి అప్పటికయితే సమస్యను తాత్కాలికంగా పరిష్కరించి మమ అనిపించి చేతులు దులుపుకున్నారు.తాజాగా వీరిద్దరి మధ్య మరొకొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందిన పీసీసీ,దళిత వర్గానికి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ వుండడంతో… మాకు కూడా ఓ పదవి కావాలని…ప్రస్తుతం రాష్ట్రంలో సగానికి పైగా మావర్గమే వుంది అని బిసి వర్గానికి చెందిన నేతలు పార్టీ హైకమాండ్ దగ్గర మొరపెట్టుకున్నారు.దీంతో బిసి నేతకి కూడా ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం.ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 4గురు వర్కింగ్ ప్రెసిడెంట్ లు వున్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక లో సైతం  ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ లు వున్నారు .తెలంగాణ లో కూడా ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను పెట్టె ఆలోచనలో హైకమాండ్ ఉంది. దీంతో…ములిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా బట్టి విక్రమార్క పరిస్థితి మారింది.అయితే బిసి లకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి బట్టిని డమ్మీ చేయాలనే ఆలోచనలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ వున్నారని గాంధీభవన్ లో నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తనని కలుపుకుని పోవడంలేదని గుర్రుగా వున్న బట్టి తాజా రాజకీయాలతో ఇటు పీసీసీ తో పాటు హైకమాండ్ పై అలకబూనారుఇప్పటికే పార్టీలో జరిగే ముఖ్యమైన నిర్ణయాలు సైతం తనకి మాటమాత్రం కూడా పీసీసీ చెప్పడంలేదని,ఇప్పుడే ఇలా వుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా కొత్తవారు వస్తే నా పరిస్థితి ఏంటని సన్నిహుతుల దగ్గర బట్టి వాపోతున్నారట.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11790
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author