ఇక వెంకన్న ఎరువులు, ఫ్లోర్ క్లీనర్స్ 

ఇక వెంకన్న ఎరువులు, ఫ్లోర్ క్లీనర్స్ 
December 13 14:34 2017
తిరుమల,
తిరుపతి వెంకన్న లడ్డూకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక సేంద్రియ ఎరువులు, ఫ్లోర్‌ క్లీనర్లు, సువాసన వెదజల్లే సుగంధాల తయారీపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. ఈ వనరులను పుష్కలంగా కలిగిన టీటీడీ త్వరలో ఉత్పత్తుల తయారీ యూనిట్లు నెలకొల్పనుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పతంజలి గో ఆశ్రమం, పంజాబ్‌లోని దివ్యజ్యోతి సంస్థాన్‌ ఆయుర్వేద కేంద్రాలను సందర్శించిన టీటీడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే తరహాలో తిరుపతిలోనూ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో 3,000కుపైగా ఆవులున్నాయి. పలమనేరు దగ్గర వంద ఎకరాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన గోశాలలో మరో 400 ఆవులున్నాయి. గో సంరక్షణలో భాగంగా వట్టిపోయిన గోవులకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు. పాలిచ్చే గోవుల కన్నా వట్టిపోయిన ఆవులు సంఖ్య పెరగటంతో నిర్వహణ వ్యయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గోవుల మూత్రం, పేడను వినియోగించి ఎరువులు, ఫ్లోర్‌క్లీనర్లు తయారు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల గోశాలల నిర్వహణ భారం కూడా తగ్గుతుంది.ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, గో మూత్రంతో ఫ్లోర్‌ క్లీనర్ల తయారీకి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం ముగిసింది. గోశాల ఆవరణ లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నాం. మిషనరీ, టర్నర్‌లను కొనుగోలు చేయాల్సి ఉంది. నాలుగు నెలల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11805
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author