బిసి మహిళలకు అవకాశం కల్పించాలి

బిసి మహిళలకు  అవకాశం కల్పించాలి
December 13 14:56 2017
హైదరాబాద్,
రాష్ట్రం లోని 119 బిసి కులాల మహిళలకు పారిశ్రామిక రంగాల్లో అవకాశం కల్పించాలని పలు బి సి మహిళా సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు రాష్ట్ర బిసి సక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను ఆయన నివాసం లో జాతీయ ఓబిసి సెంట్రల్ కమిటి చైర్ పర్సన్ ఎం.భాగ్య లక్ష్మి,బి సి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ఆలం పల్లి లత,బి సి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కే.లక్ష్మిబాయి ప్రతినిధుల బృందంకలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు వాట్లడుతూ 70 సంవస్సరాల స్వతంత్ర భారత దేశం లో బిసి మహిళలు పారిశ్రామికంగా ముందుకు రాలేక పోయారని తెలిపారు.ఇందుకు కారణం చేతి వృత్తులు,కుటీర పరిశ్రమలకే వారు పరిమితం కావడం  ముఖ్యంగా విద్య పరంగా, ఆర్ధిక పరంగా వారు అభివృద్ధి చెందక పోవడమే నని వారు పేర్కొన్నారు.తెలంగాణా ప్రభుత్వం శ్రమను నమ్ముకొని జీవిస్తున్న బడుగు బలహీన వర్గాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనీ మహిళా పారిశ్రామిక విదానాన్ని ప్రకటించడం అభినందనీయమన్నారు.ఎస్సి ,ఎస్టి ల లాగా బి సి మహిళలకు కుడా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకోడానికి సబ్సడి తో కూడిన రుణాలు మంజూరు చేయాలనీ వారు మంత్రిని కోరారు.అలాగే ఎంబిసి లకోసం కేటాఎంచిన 1000 కోట్ల నిధిని ఈ నెల 30 వ తేది లోగా ఖర్చు చేయాలనీ కోరారు.31 జిల్లా లలో2017-18 సంవస్సరానికి గాను బిసి కర్పొరేషన్,బిసి ఫెడరేషన్ ల ద్వార లక్షా 50 వేల మంది అబ్యర్తులకు దరఖాస్తులు తీసుకొని పూచి కత్తులు లేకుండా రుణాలు ఇవ్వాలని కోరారు.ఫై డిమండ్లఫై స్పందించిన మంత్రి జోగురామన్నఈ నెల 22 న సమావేశాన్ని నిర్వహిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో ఫై కృష్ణ గౌడ్,విజ్ఞేశ్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11829
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author