జేసీ బ్రదర్స్ కు మూడు ఓకే

జేసీ బ్రదర్స్ కు మూడు ఓకే
December 14 10:21 2017
విజయవాడ,
తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా స్ట్రాంగ్. సి.ఎం కేసీఆర్ పావులు కదిపినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. అలానే జేసీ బ్రదర్స్ కు అనంతపురంలో అంతే పేరుంది. ఓటమి లేకుండా తమ ప్రస్తావన సాగిస్తుంటారు. పార్టీ ఏదైనా గెలుపు వారిదే. అలా సాగుతోంది. ఏం చేస్తారనేది తర్వాత సంగతి. గెలుపు మాత్రం వారిదే ఉంటోంది. వైఎస్ కేబినెట్ లో పంచాయితీ రాజ్ మంత్రిగా ఉన్న జేసీకి కిరణ్ సర్కార్ లో చోటు దక్కలేదు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అతను సోనియాగాంధీనే దెయ్యం అన్నాడు. బండరాయి అని తిట్టిపోశాడు. అయినా సరే కాంగ్రెస్ అతని పై చర్య తీసుకునే సాహసం చేయలేదు. ఆ తర్వాత టీడీపీలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా గెలిచాడు. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి నుంచి గెలిపించుకున్నారు. ఇప్పుడు అనంత‌పురం జిల్లా టీడీపీ రాజ‌కీయాల్లో ప‌రిటాల‌, జేసీ, ప‌య్యావుల పేర్లు మారుమోగుతున్నాయి. పేరుకు కాల్వ శ్రీనివాసులు మంత్రిగా ఉన్నా..హావా అంతా పయ్యావుల, పరిటాల వారిదే. జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయాల రూటే స‌ప‌రేటు. ప్రత్యర్థులకు పెద్దగా అవకాశం ఇవ్వరు జేసీ బ్రదర్స్. ఓటమి వస్తుందంటే చాలు ఎంతకైనా తెగించే రకం. అదే జేసీ బ్రదర్స్ ను గెలుపు బాట పట్టేలా చేస్తోంది. తన హావా తగ్గుందని భావించినప్పుడు మాటలతో చేతలతో  దూకుడు మంత్రం ప్రయోగిస్తారు. మా వాడు మాడు అంటూనే జగన్ కు సున్నం పెట్టేలా మాట్లాడటం జేసీ బ్రదర్స్ కే చెల్లింది.   ఇప్పుడు జేసీ బ్రదర్స్ తమ వారసులను రాజకీయాల్లోకి తెచ్చే పని చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను  పోటీ చేయ‌న‌ని, తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశాడు ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి. అనంతపురం ఎంపీ స్థానానికి త‌న త‌న‌యుడికి టికెట్ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబును కోరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు పవ‌న్‌కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తార‌నే సమాచారం.
రంగంలోకి వారసులు.మరోవైపు తాడిప‌త్రిలో ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న వార‌సుడు అస్మిత్‌రెడ్డిని పోటీ చేయించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. తాడిప‌త్రి అసెంబ్లీ సీటు ఎలాగూ జేసీ ఫ్యామిలీకే ఇవ్వాలి. ఇక్క‌డ గెలుపు గ్యారెంటీ కావ‌డంతో ప్రభాక‌ర్‌రెడ్డి తాను త‌ప్పుకుని త‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు. అస్మిత్‌రెడ్డి ఇప్పుడు తాడిప‌త్రి మునిసిపాలిటీలో కౌన్సిల‌ర్‌గా ఉన్నారు.  ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న సీటును వార‌సుడికి ఇచ్చి తాను గుంత‌క‌ల్లు నుంచి పోటీ చేయాల‌ని ఆలోచిస్తున్నాడట. జేసీ కూడా తాడిప‌త్రి, అనంత‌పురం ఎంపీ సీట్లు వార‌సుల‌కు ఇచ్చి, త‌మ్ముడు ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గుంత‌క‌ల్లుకు వెళ్లమని చెబుతున్నట్లు తెలుస్తోంది. జేసీ గ‌ట్టిగా ప‌ట్టుబ‌డితే చంద్ర‌బాబు గుంత‌క‌ల్లు సీటు కూడా ఇచ్చే అవకాశముంది. త‌మ ఫ్యామిలీకి రెండు ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు ఓ ఎంపీ సీటు కావాల‌ని జేసీ ఫ్యామిలీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.   అదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. సీట్లు మూడే పదవులు నాలుగు అనేలా ఉంది వారి వ్యవహారం. మరి చంద్రబాబునాయుడు వారి కోరికను ఎంత వరకు నెరవేరుస్తాడో చూడాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11870
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author