ఒకే బస్సులో 180 మంది…

ఒకే బస్సులో 180 మంది…
December 14 13:20 2017
అదిలాబాద్,
దామరచర్ల మం డల పరిధిలోని బొత్తలపాలెం శివా రులోని ఆదర్శ పాఠశాల విద్యా ర్థులకు బస్సు గం డం పొంచి వుంది. ఆదర్శ పాఠశాలను మండ ల కేంద్రంలో కాకుండా బొత్తల పాలెం, రాఠ్లవాగు తండాల మధ్య ఏ స్టేజీ లేని అద్దంకి -నార్కట్‌పల్లి రహదారికి 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల రాకపోకలు జరిగే మార్గం చూపలేదు. గతంలో విద్యా ర్థుల సమస్య లను వారి తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో మిర్యాలగూడ డిపో మేనే జర్‌కు బస్సు నడిపించాలని ఆదేశించారు. దీంతో ఆర్టీసి బస్సు సర్వీసును ప్రారంభించారు. కానీ ఒకే బస్సులో 180 మంది విద్యా ర్థులు ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నారు.ఓవర్‌లోడ్‌తో బస్సులో ప్రయాణం చేయడం నరకాన్ని మరిపిస్తుం దని విద్యార్థులు చెబుతున్నారు. మోడల్‌స్కూల్‌కు వెళ్లే వెళ్లే విద్యా ర్థులు, ఉపాధ్యాయులు 180 మంది ఉన్నారు. వీరంతా పలు గ్రామాలు, గిరిజన తండాల నుంచి దామరచర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడికి ఆర్టీసి బస్సు వస్తుంది. దామరచర్ల స్టేజీలోనే విద్యార్థులతో బస్సు నిండిపోతుంది. రాజగట్టు, బొత్తలపాలెం, రాళ్లవాగు తండా స్టేజీల వద్ద విద్యార్థులు బస్సు టాప్‌పైకి ఎక్కి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రతిరోజు ఈ విధంగా 180 మంది ఒకే బస్సులో ప్రయాణం చేయాలంటే దినదిన గండంగా ఉం టున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు బస్సును నడిపిం చాలని విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.బొత్త పాలెం శివారులోని ఆదర్శ పాఠశాలకు వెళ్లే విద్యా ర్థులు వారి సంఖ్యకు సరిపడా బస్సులులేక అవస్థలు పడుతున్నారు. బస్సు లోపల స్థలం లేకపోవడంతో బస్సు టాప్‌పైకి ఎక్కి ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు. మిర్యాల గూడ డిపో మేనేజర్ విద్యార్థుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని తక్షణం అదనపు బస్సు నడపాలని ఎబిపి మండల శాఖ కన్వీనర్ మోదాల కృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఆయన వెంట కోకన్వీనర్ దేవులపల్లి వెంకటేష్, వికాస్‌రెడ్డి, శివరాం, ఉదయ్, పవన్ తదితరులున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11898
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
bus
  Categories:
view more articles

About Article Author