టీఆర్‌ఎస్‌లో చేరిన ఉమామాధవరెడ్డి

టీఆర్‌ఎస్‌లో చేరిన ఉమామాధవరెడ్డి
December 14 18:26 2017
హైదరాబాద్,
మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి గురువారం ముఖ్య మంత్రి కెసిఆర్  సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి, సందీప్ రెడ్డి టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఉమామాధవరెడ్డితోపాటు ఆమె అనుచరులు కొమురెల్లి నర్సింహారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నోముల మాధవరెడ్డి, చెరకు శివయ్యగౌడ్, జంగారెడ్డి, జయరాములు, భువనగిరి వైస్ ఎంపీపీ మోడెపు శ్రీనివాస్, భువనగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రమేశ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతోపాటు రెండువేలమంది టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉమామాధవరెడ్డి తనకు తోబుట్టువులాంటిదని అన్నారు.ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్లుందన్నారు. 1985లో నేను, మాదవరెడ్డి ఒకటేసారి ఎమ్మెల్యేలం అయినామని, తెలంగాణకు సరిగ్గా నిధులు రాకపోతే నేను, మాధవరెడ్డి కలిసి వెళ్లి ముఖ్యమంత్రితో నిధుల కోసం కొట్లాడేవాళ్లమని సీఎం తెలిపారు. చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచినపుడు నాతోపాటు మాధవరెడ్డి చంద్రబాబును వ్యతిరేకించారన్నారు.ఎలిమినేటి మాధవరెడ్డి నా ఆత్మీయ మిత్రులన్నారు. రాజకీయాలు సర్వసాధారణమని, ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తామని, కొత్త రాష్ట్రం ఆరునూరైనా బాగుపడాలని సీఎం ఆకాంక్షించారు. ఏ అంశాల్లో గోసపడ్డామో, ఆ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. నల్గొండ నుంచి చాలా మంది మంత్రులయ్యారు. నల్గొండ జిల్లా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డి అని సీఎం స్పష్టం చేశారు. ఉమామాధవరెడ్డి, సందీప్‌రెడ్డికి మంచి భవిష్యత్ ఉంటదన్నారు. సందీప్‌రెడ్డికి మంచి అవగాహన శక్తి ఉంది. రాజకీయాల్లో ఎవరికి, ఎపుడు, ఏ అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరని పేర్కొన్నారు.ఈ రోజుల్లో రాజకీయాల్లో ఓపిక తక్కువగా ఉంటుంది. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉమామాధవరెడ్డి నాముందు ఎలాంటి డిమాండ్ పెట్టలేదు. ఉమామాధవరెడ్డి, సందీప్‌రెడ్డికి ఉన్నత అవకాశాలుంటాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నమని చెప్పారు. జవవరి 1 నుంచి రైతులతోపాటు ప్రజలందరికీ 24 గంటల కరెంట్ ఇస్తమని చెప్పారు. భువనగిరి నియోజకవర్గానికి పుష్కలంగా సాగునీరిస్తమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, కిశోర్, శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11952
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author