పోలవరంలో నాణ్యతను పట్టించుకోవాలి 

పోలవరంలో నాణ్యతను పట్టించుకోవాలి 
December 14 18:46 2017
రాజమహేంద్రవరం,
ఎంపీ డాక్టర్ కెవిపి పిటిషన్ వలన   రాష్ట్రప్రభుత్వం ఈ నెల 19 లోపు వాస్తవాలు హైకోర్టుకు చెప్పే మంచి అవకాశం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దక్కిందన్నారు. ఇదేదో కేంద్రాన్ని ఇరుకున పెట్టేదో,కేంద్రంతో తగవు పెట్టేదో ఎంతమాత్రం కాదని, నిజానికి ఇది చంద్రబాబుకి వరం లాంటిదని  అన్నారు. గురువారం నాడు అయన పత్రికా సమావేశంలో మాట్లాడారు.
నాణ్యత పట్టించుకోండి …
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోవాలని ఉండవల్లి సూచించారు. నీళ్లలోనే కాంక్రీట్ వేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు తనకు వచ్చాయని, ‘పోలవరాన్ని హత్య చేస్తున్నారు’ అనే క్యాప్షన్ కూడా పెట్టారని ఆయన పేర్కొంటూ,వీటిని సీఎం కి పంపామని చెప్పారు. ఇక  కేంద్రమంత్రి గడ్గారి తో చంద్రబాబు సమావేశం కావడం, ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలుగుతున్నట్లు చెప్పడం చూశామని,అయితే ట్రాన్స్ ట్రాయికి నెలరోజుల గడువు ఇచ్చినట్లు,ఒకవేళ అప్పటికీ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయని,ఇది నిజంగా నెలరోజుల్లో ఇంగ్లీషు నేర్పుతామన్న చందంగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
ఎఫ్ డి ఆర్ ఐ చట్టాన్ని ఎంపీలు వ్యతిరేకించాలి
స్విస్ బ్యాంకు ల్లో నల్లధనాన్ని వెలికి తీస్తానన్న మోడీ,  దాన్ని దారిమళ్లించడానికి నోట్లరద్దు తెరమీదకు తెచ్చార ని , ఆతరవాత జీఎస్టీ తెచ్చారని, ఇప్పుడు కొత్తగా ఎఫ్ డి ఆర్ ఐ  చట్టం తీసుకురాబోతున్నారని, ఇది నిజంగా  దేశాన్ని సర్వనాశనం చేసే ఆలోచనగా కనిపిస్తోంద ని ఉండవల్లి అనుమానం వ్యక్తంచేసారు. ఈ చట్టాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఎపి నుంచి గల్లా జయదేవ్, తెలంగాణ నుంచి విశ్వేశ్వర రెడ్డి కమిటీలో ఉన్నందున ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని ఆయన కోరారు. నిజానికి  నోట్ల రద్దువలన  మధ్యతరగతి,సామాన్య  ప్రజలే తీవ్రంగా నస్టపోయారని, ఇక ఎఫ్ డి ఆర్ ఐ చట్టం తెస్తే, పూర్తిగా దెబ్బతింటారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.   స్విస్ బ్యాంకు లో పేరుమోసిన రాజకీయ నేతల డబ్బులుంటే వాటిని వెనక్కి తేవడం కష్టం కాదని ఎందుకంటే, డిపాజిట్ దార్లలో పేరున్న రాజకీయ నేతల గురించి ఆరోపణలు వస్తే, వారి ఖాతాలు సీజ్ చేసేవిధంగా స్విస్ ప్రభుత్వం 2011లోనే చట్టంచేసిందన్నారు. ఈ చట్టంప్రకారం కొన్ని దేశాల నేతల ఖాతాలను స్విస్ బ్యాంకు సీజ్ చేసిందని ఆయన సోదాహరణంగా చెప్పారు. ఇక ఎఫ్ డి ఆర్ ఐ చట్టం వస్తే,  డబ్బు మన ఎకౌంట్ లో వెయ్యడం కాదు… మన అకౌంట్ లోని డబ్బు లాగేసేలా  కనిపిస్తోందని ఉండవల్లి ఆవేదన వ్యక్తంచేశారు.  ప్రపంచంలో అన్నిచోట్లకంటే పటిష్టమైన మన బ్యాంకింగ్ వ్యవస్ధ ను దెబ్బతీసే ప్రయత్నంగా కూడా ఎఫ్ డి ఆర్ ఐ చట్టం ఉండబోతోందని ఆయన విశ్లేషించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్దంగా బ్యాంకింగ్ వ్యవస్థను కూల్చే చట్టంగా ఆయన అభివర్ణించారు. ‘ఎఫ్ డి ఆర్ ఐ బిల్లులో బెయిల్ ఇన్ అనే పదం వుంది.  ఎవరైనా బడాబాబులు బ్యాంకు రుణాలు ఎగ్గొడయితే, ఆమేరకు బ్యాంకులకు జరిగే  నష్టాన్ని ప్రభుత్వం పూడుస్తుంది.  ప్రభుత్వం అంటే ప్రజలే కదా. ప్రజలు డిపాజిట్లలో కొంతమొత్తాన్ని షేర్ గా మలిచి, మిగిలిన సొమ్మే విత్ డ్రా చేసుకోడానికి బ్యాంకులు ఈ చట్టం ద్వారా ప్రయత్నిస్తాయి. వ్యాపారం చేసే పరిస్థితిలు లేక, ఉన్నసోమ్ముని చిన్నపాటి వడ్డీకోసం బ్యాంకుల్లో దాచుకునే ఎంతోమంది ఇప్పుడు ఎఫ్ డి ఆర్ ఐ  చట్టంవలన తమ డిపాజిట్ల సొమ్మును వెనక్కి తీసుకునే అవకాశం కోల్పోయే ప్రమాదం పొంచివుంది’అని ఉండవల్లి అనుమానం వ్యక్తంచేశారు. అందుకే ప్రజలకు మాహాపాపం చేసే ఎఫ్ డి ఆర్ ఐ బిల్లు చట్టంగా మారకుండా అడ్డుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేసారు. సాధారణంగా ఎవడి పాపానికి వాడే పోతాడని కర్మ సిద్ధాంతం మనదని, అయితే ఇక్కడ ఎవరో చేసిన పాపానికి మనందరం పోతామని ఆయన వ్యాఖ్యానిస్తూ, ఎఫ్ డి ఆర్ ఐ ని అడ్డుకోవాలన్నారు.
ఇదో రకం దోపిడీ …
చంద్రన్న మాల్స్ అంటే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న వ్యాపారం గా ఉండవల్లి అభివర్ణించారు. నిజానికి బయట మార్కెట్ కన్నా చంద్రన్న మాల్స్ లో ఎక్కువ రేట్లు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. చిన్న చిన్న గ్రామాలకు కూడా వీటిని విస్తరించి, చౌక డిపోలను కూడా ఈ మాల్స్ లో చేర్చి, తప్పనిసరిగా అక్కడే కొనుక్కునే దుస్థితి కల్పించబోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11972
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author