సైబరాబాద్‌ సృష్టికర్త చంద్రబాబే

సైబరాబాద్‌ సృష్టికర్త చంద్రబాబే
December 14 19:12 2017
హైదరాబాద్‌,
ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఎట్టకేలకు ఒప్పుకున్నారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. హైటెక్స్‌ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.‘ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘమని, ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుంది’ అని కేటీఆర్‌ అన్నారు.పలువురు ఐటీ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భవిష్యత్తులో హైదరాబాద్‌ నగర అభివృద్ధి ప్రణాళికలు, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు. బెంగళూరు, గురుగ్రామ్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. 17ఏళ్లలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌ ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదని.. ఈ నగరానికి 450ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్‌ మూర్తి, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ డేబ్జానీ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11997
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author