పండ్ల తోటలతో అనంత కరువు దూరం

పండ్ల తోటలతో అనంత కరువు దూరం
December 14 22:59 2017
అనంతపురం,
రాష్ట్రంలోనే అత్యధికంగా పళ్లతోటలు సాగవుతున్న జిల్లా అనంతపురం జిల్లా…ఇక్కడ ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతుంది.  సూటు కమిషన్ పేరుతో 20శాతం దాకా దళారుల పాలవుతుంది. పంటల నిల్వకు గొడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ లు లేక మరింత నష్టపోతున్నారు. పంట అమ్మకానికి ఇతర ప్రాంతాలకు వెళ్లలేక దళారులను అశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
జిల్లా వ్యాప్తంగా అనంతపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం, కల్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలలో ఎక్కువగా పండ్ల తోటలను 1.74 లక్షల హెక్టార్లలో 87వేల 71 మంది రైతులు సాగుచేస్తున్నారు. సాలీనా వచ్చే దిగుబడి 3కోట్ల 48లక్షల 15వేల 112 టన్నులు.  ఒక్కో సీజన్లో దాదాపు 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పంటను రైతులు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి. జిల్లా ఎక్కువగా చీనీ సాగుచేస్తున్నారు.  వీటి విక్రయాల్లో దాదాపు 2వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది.అయితే రేట్లు స్థిరంగా లేకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. అనంతపురం, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి,  రామగిరి ప్రాంతాలలో ద్రాక్ష సాగవుతుంది. రైతులు ద్రాక్షను అమ్ముకోవడానికి బెంగళూరు, ఒరిస్సాకు వెళ్ళాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా  బొప్పాయి సాగు విస్తారంగా జరుగుతోంది. ఈ పంటకు మార్కెటింగ్ సదుపాయం లేక రైతులు నేరుగా బెంగళూరు, ముంబాయికి వెళ్లాల్సిందే. లేకుంటే దళారుల చెంతకు చేరాల్సిందే.  రైతులు మార్కెట్ సదుపాయం లేక పండించిన పంటను దళారులకు విక్రయిస్తున్నారు. దీంతో దళారులు చెప్పిదే రేటు. దళారుల కారణంగా రైతులు తీవ్ర నష్టపాలవుతున్నారు.  ఒక్కోసారి రైతులు ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా  ఎగొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీంతో రైతులు అంత దూరం తీసుకెళ్ళి నష్టపోవటం కంటే వచ్చిన కాటికే అమ్ముకుంటే  సరిపోతుందనే భావనతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12059
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author