ఇండియాలోనే గూగుల్ తొలి అడుగు ఆంధ్రప్రదేశ్ లో

ఇండియాలోనే గూగుల్ తొలి అడుగు ఆంధ్రప్రదేశ్ లో
December 15 10:11 2017
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల వరద పారించడమే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ అధికారులు, గూగుల్ ఎక్స్ కంపెనీ సీఈఓ ఆస్ట్రో టెల్లర్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను గూగుల్ ఎక్స్ ప్రారంభించనుంది. అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఎక్కడా తమ కార్యకలాపాలను విస్తరించలేదు గూగుల్ ఎక్స్ కంపెనీ. కానీ ఇప్పుడు మంత్రి లోకేష్ తో జరిగిన చర్చల తర్వాత ఆంధ్రుల నగరికి రానుంది ఆ కంపెనీ. ఇది ఆంధ్రులకు గర్వకారణంగా భావించవచ్చు.
మొదటిసారి ఇండియాలో అడుగు పెడుతున్న గూగుల్ ఎక్స్ త్వరలోనే విశాఖపట్నం లో గూగుల్ ఎక్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుండటం పట్ల మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గూగుల్ ఎక్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు కానుందని చెప్పారు నారా లోకేష్.వేమో (డ్రైవర్ లెస్ కార్), అధునాతన గూగుల్ గ్లాస్సెస్, ప్రొజెక్ట్ లూన్ (బేలూన్స్ ఎగరవేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం) లాంటి టెక్నాలజీలను అభివృద్ధి చేసింది గూగుల్ ఎక్స్. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోయే సెంటర్ లో అధునాతన టెక్నాలజీల పై పరిశోధన చేయనుంది. అంతే కాదు…అభివృద్ధి చేయనున్న గూగుల్ ఎక్స్ ఫైబర్ గ్రిడ్ తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ (ఎఫ్సాక్ FSOC) లింక్స్ ఏర్పాటు చేయనుంది గూగుల్ ఎక్స్. ఫలితంగా ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు…ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ తో గ్రామీణ ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ రానుంది.ఇక ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ద్వారా అతి తక్కువ ధరకే ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ అందుబాటులో ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ ఎక్స్ రాక తో కమ్యూనికేషన్ లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా 1.45 కోట్ల ఇళ్లు, 12,918 పంచాయితీలు, 60వేలకు పైగా పాఠశాలలు, 10 వేలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు, 670 మండల కార్యాలయాలు, 96 మున్సిపాలిటీలు, 14 కార్పోరేషన్లు, ఆరు వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.తొలి దశలో ఇప్పటికే ఎపి ఫైబర్ ద్వారా 23 వేల 800 కిలోమీటర్ల కేబుల్ నెట్ వర్క్ ని ఏర్పాటు చేసాం. రెండో దశలో 59వేల 563 కిలోమీటర్ల భూగర్భ కేబుల్ నెట్ వర్క్ ఏర్పాటు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయబోయే ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ని వినియోగించబోతున్నాం. వీటి ద్వారా 1300 పాఠశాలలు, 1500 ప్రభుత్వ కార్యాలయాలు, లక్ష కు పైగా ఇళ్లు, 18 వేల సీసీ కెమెరాలు ఇప్పటికే ఏపీ ఫైబర్ ద్వారా అనుసంధానం అయ్యాయి.రాష్ట్రంలోని టెల్కో టవర్ల ద్వారా అన్ని ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, డేటా సెంటర్లు, బ్రాడ్ కాస్ట్ కేంద్రాలను కూడా ఈ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకు రావాలని నిర్ణయించాం. ఐపిటీవీ ప్రత్యేకమైన యాప్ ఏర్పాటు ద్వారా ఏపీ ఫైబర్ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయి. సర్టిఫికేట్ లెస్ గవర్నెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అమలు తీరును ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకుంటున్నాం. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించబోతున్నామని నారా లోకేష్ అన్నారు. తొలి రోజే లోకేష్ జరిపిన చర్చలు ఫలవంతం కావడం శుభసూచికమనే చెప్పాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12068
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author