సిక్కోలు లో వరీ వర్రీ

సిక్కోలు లో వరీ వర్రీ
December 15 13:01 2017
శ్రీకాకుళం,
శ్రీ కాకుళం జిల్లాలో ప్రధాన పంట వరి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారు. వాతావరణ సమతూల్యత లేక, అతివృష్టి, అనావృష్టిల మధ్య అతికష్టం మీద ఖరీఫ్ పంట గట్టేక్కడమే కష్టమైంది. మిగులు సంగతి పక్కన పెడితే పెట్టుబడులైన వస్తాయోరావో అన్న అనుమానాల నడుమ ధాన్యం కొను‘గోల’ మొదలైంది. తప్పులన్నీ ప్రభుత్వ ఉద్యోగుల వల్లే జరుగుతున్నాయన్న అంశంతోనే ఈ సమీక్ష ఆరంభమైంది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులను నిలదీత, నిలువెత్తుగా నిందించే విధానాలు ఈ సమీక్షలో ప్రభుత్వ ఉద్యోగులను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకువెళ్ళినప్పటికీ, కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి సమయస్ఫూర్తితో సాదాసీదాగానే ముగిసింది. జిల్లాలో ధాన్యం సేకరణపై జిల్లా అధికారులు మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష వాడిగావేడిగా ప్రారంభమైనప్పటికీ, వాస్తవ పరిస్థితులపైఅచ్చెన్న పూర్తిస్థాయిలో చర్చ నిర్వహించారు. సాంకేతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అనునిత్యం ధాన్యం కొనుగోలుపై పడే విషయాలను అధికారులు మంత్రితో సుస్పష్టం చేయలేకపోవడం వల్ల చీవాట్లు తినాల్సివచ్చిందన్న భావన సమీక్ష అనంతరం అధికారుల నుంచి వినిపించింది. రాజకీయ ఒత్తిళ్ళు వల్లే అధికారులు ఎవరి పని వారు చేసుకోలేకపోతున్నామని, ఆ పరిస్థితులకు మిల్లర్లు కారణమంటూ చెప్పుకురావడం గమనార్హం. అయితే, జిల్లాలో ఇంత వరకూ ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై అచ్చెన్న తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకు ధాన్యం కొనుగోలు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం చేయరాదని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఆర్.వెంకటేశ్వరరావును ఆదేశించారు. జిల్లాలో 132 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడం సరైన చర్య కాదని మంత్రి అచ్చెన్న ఆగ్రహించారు. జిల్లాలో 313 మిల్లులకుగాను 10వ తేదీ నాటికి 93 మిల్లులు బ్యాంకు గ్యారంటీ ఇచ్చాయని ఆయన చెప్పారు. మిగిలిన మిల్లులు 15వ తేదీనాటికి బ్యాంకు గ్యారంటీలు ఇస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేసారు. జిల్లాలో శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం కావల్సిందేనంటూ అధికారులను మంత్రి శాసించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళుకు రూ. 15 వేల కోట్లు రుణం తీసుకవచ్చిందన్నారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. విత్తనాలు, సాగునీరు సకాలంలో అందించాలని, ధాన్యం కొనుగోళు సకాలంలో చేయకపోతే రైతుల్లో ఆందోళన ప్రారంభం అవుతుందని మంత్రి హెచ్చరించారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నారని, కాని – జిల్లాలో అవన్నీ ఆలస్యంగానే ఉన్నాయన్నారు. మద్దతు ధరకు లేదా అంతకంటే ఎక్కువ ధరకు మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని రైతులను కోరారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12154
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author