మనిషికి ఆయువు పట్టు గుండె

మనిషికి ఆయువు పట్టు గుండె
December 15 16:53 2017
హైద్రాబాద్,
గుప్పెడంతే ఉంటుంది కానీ మనిషికి ఆయువు పట్టు గుండె. అతి భద్రంగా ఉన్నంత వరకు మనిషి ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదు. అందుకే చుట్టూ ఎముకలతో ఎక్కడో ఛాతి లోపల గుండె ఎంతో భద్రంగా ఉంటుంది. కానీ ఈ శిశువుకు మాత్రం గుండె బయటికి వచ్చింది. శరీరం బయట గుండెతో, ఎలాంటి రక్షణ లేకుండా యూకేలోని లీచెస్టర్‌లో ఓ పాప జన్మించింది. ఎక్కడో లోలప ఉండాల్సిన గుండె పాప ఛాతిపై కనిపించడంతో కన్నతల్లి కన్నీరుపెట్టుకుంది. కానీ ఆ చిన్నారి మృత్యువును జయించింది. కన్నతల్లి ఆశలను బతికించింది. పాపకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు గుండెను భద్రంగా ఛాతి లోపల అమర్చారు. పాపను కాపాడారు.ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌కు చెందిన నవోమి ఫిండ్లే , డీన్ వికిన్స్ దంపతులకు నవంబర్ 22న లీచెస్టర్‌లోని గ్లెన్‌ఫీల్డ్ ఆస్పత్రిలో ఆడ శిశువు జన్మించింది. అయితే ఆ పాప ఛాతిపై గుండె తో పుట్టడంతో 10 శాతం మాత్రమే బతికే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చిచెప్పారు. తమ ప్రయత్నం తాము చేస్తామని, పాప ప్రాణంపై ఆశలు పెట్టుకోవద్దని తల్లిదండ్రులకు చెప్పేశారు. కానీ విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి మూడు వారాల చిన్నారి ప్రాణాలను నిలబెట్టారు. మొత్తం 50 మందితో కూడిన వైద్యుల బృందం ఎంతో కష్టపడి ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. యూకే చరిత్రలోనే ఇలాంటి శస్త్రచికిత్సను తొలిసారి నిర్వహించారు.గుండె బయటి ఉండి పుట్టడం ఎంతో ప్రమాదకరం. దానికి ఏ చిన్న దెబ్బ తగిలినా పాప ప్రాణానికే అపాయం. అందుకే పుట్టిన కొన్ని క్షణాల్లోని ఆ శిశువును స్టెరైల్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టేశారు. గుండెపైన తేమ ఆరిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. పాప పుట్టిన 50 నిమిషాల్లోనే గుండెను యథాస్థానంతో వైద్యులు అమర్చారు. మూడు వారాపాటు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించి ఇక ఎలాంటి ప్రాణాపాయం లేదని గ్రహించి డిసెంబర్ 13న గ్లెన్‌ఫీల్డ్ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స విషయాన్ని ప్రకటించారు. పాపకు వనెల్లోప్ హోప్ వికిన్స్ అని నామకరణం చేశారు. గడిచిన 30 ఏళ్లలో యూకేలో ఇలాంటి కేసు నమోదుకావడం ఇదే రెండోసారి అని ఆస్పత్రి వెల్లడించింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12213
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author