కొత్త జిల్లాలకు నీతి ఆయోగ్ నిధులు

కొత్త జిల్లాలకు నీతి ఆయోగ్ నిధులు
December 15 17:26 2017
హైదరాబాద్,
తెలంగాణలోని కొత్త జిల్లాలకు నీతీ ఆయోగ్ నిధులు అందనున్నాయి. ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన జిల్లాల జాబితాలో కేంద్రం కొత్త జిల్లాలకు చోటు కల్పించింది. జయశంకర్‌ భూపాలపల్లి, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్, ఖమ్మం లాంటి 3 జిల్లాలకు ఆ అవకాశం దక్కింది. మరో మూడు జిల్లాలను కూడా జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 115 జిల్లాల్లో తెలంగాణలోని మూడు జిల్లాలను నీతి ఆయోగ్‌ ఈ జాబితాలో చేర్చింది. వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, వాటిని శరవేగంగా సమగ్ర అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ కార్యక్రమం చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 2022 న్యూ ఇండియా లక్ష్య సాధన దిశగా ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అక్కడున్న వెనుకబాటుతనం, పేదరికం, తీవ్రవాద ప్రాబల్యంతోపాటు అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, తాగునీరు, విద్యుత్తు వసతి తదితర కీలకమైన మౌలిక సదుపాయాలను ప్రామాణికంగా తీసుకొని జిల్లాలను ఎంపిక చేసే బాధ్యతను నీతి అయోగ్‌కు అప్పగించింది. నీతి ఆయోగ్‌ ఎంపిక చేసిన జిల్లాల్లో రాష్ట్రంలోని మూడు జిల్లాలకు చోటు లభించింది. సత్వర అభివృద్ధిని లక్ష్యంగా ఎంచుకోవటంతో సమన్వయ సాధనకు, వేగంగా పనులు జరిగేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాలకు ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఖమ్మం జిల్లాకు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు వసుదా మిశ్రా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు సంజయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగిన సమన్వయం అందించేందుకు రాష్ట్రం తరఫున నోడల్‌ అధికారులను నియమించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు జి. అశోక్‌కుమార్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు నవీన్‌ మిట్టల్, కుమురం భీమ్‌ జిల్లాకు నదీమ్‌ అహ్మద్‌ను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12234
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author