జోరుమీద టీ కాంగ్రెస్

జోరుమీద టీ కాంగ్రెస్
December 15 17:33 2017
హైదరాబాద్,
తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ జోరు పెంచింది. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌ ఆక‌ర్ష్‌తో విల‌విల లాడిన కాంగ్రెస్‌ ఇప్పుడు అదే అస్త్రాన్ని ప‌క్కా గా అమ‌లు చేస్తూ.. గులాబి బాస్‌కు చుక్కలు చూపిస్తుంది. రేవంత్‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో మరింత దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. ఇదే టెంపోను కొన‌సాగిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్‌ ఆక‌ర్ష్‌కు తెర‌లేపింది. 2 019 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండడంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను షురూ చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది.  ఇప్పటికే రేవంత్ రెడ్డి, మరికొందరు తెలంగాణ టీడీపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ హైకమాండ్…ఇప్పుడు టీఆర్ఎస్‌లోని అసమ్మతి వర్గంపై కన్నేసినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  హ‌స్తం గూటికి రేవంత్ చేర‌డంతో టీ టీడీపీ డీలా పడింది. ఇదే అదనుబా భావించిన కాంగ్రెస్‌… ఇతర నేతలను టార్గెట్‌ చేసింది. జిల్లాల్లోని నేతలు మొదలుకొని రాష్ట్రస్థాయి నేతల వరకు అందరినీ పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పటికే రేవంత్‌తోపాటు.. 20 నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ముఖ్య నేత‌లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌తో పొస‌గ‌ని టీడీపీ నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఉత్తమ్‌, భ‌ట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి ,ష‌బ్బీర్‌ ఆలీ, డీకే అరుణ‌, జైపాల్‌ రెడ్డిల స‌మ‌క్షంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌ సహా ఇతర పార్టీల్లోని సెకండరీ క్యాడర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటున్నారు. అంతేకాదు…ఎంపిటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
మొత్తానికి మొన్నటి దాకా వ‌ర‌స ఓట‌మిలు, వ‌ల‌స‌ల‌తో ఉక్కిరి బిక్కరి అయిన కాంగ్రెస్ పార్టీలోకి.. నేతల చేరిక‌లు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇదే తీరును కొనసాగించి 2019లో అధికారమే ధ్యేయంగా హస్తం పార్టీ ముందుకు సాగుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12237
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author