స్వాతి ఒత్తిడితోనే సుధాకర్ రెడ్డి హత్య: రాజేష్ 

స్వాతి ఒత్తిడితోనే సుధాకర్ రెడ్డి హత్య: రాజేష్ 
December 15 22:17 2017
నాగర్ కర్నూలు,
సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్ జిల్లా సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను నాగర్ కర్నూల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.  రెండు సంవత్సరాల క్రితం రాజేశ్ కు స్వాతితో వివాహేతర సంబంధం ఏర్పడిందని తెలిపారు. సుధాకర్ రెడ్డి స్వాతిని నిర్లక్ష్యం చేయడం, తరచూ కొట్టడంతో వివాహేతర సంబంధం వైపు మొగ్గు చూపిందన్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న స్వాతి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టారు. స్వాతి ఇచ్చిన సమాచారం ఆధారంగా క్లూస్ టీమ్‌.. స్వాతి, సుధాకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టి, పలు ఆధారాలు సేకరించారు. శుక్రవారం నాడు స్వాతిని కోర్టులో హజరు పరిచారు. ఆమెకు మరో పదిహేను రోజులు రిమాండ్ ను కోర్టు విధించింది.
గత నెల 26 న తెల్లవారుజామున సుధాకర్ రెడ్డి ముఖంపై దిండుతో స్వాతి వత్తిపట్టగా.. రాజేశ్ ఇనుప రాడ్డుతో కొట్టాడని చెప్పారు. సుధాకర్ రెడ్డి చనిపోయిన తర్వాత అతని కారులోనే మృతదేహాన్ని తరలించారని వెల్లడించారు. ఫతేపూర్ అడవుల్లో సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని తగులబెట్టాక తిరుగు ప్రయాణంలో కారును మెకానిక్ షెడ్ లో పెట్టి అద్దె కారులో నాగర్ కర్నూల్ చేరుకుని యాసిడ్ డ్రామా క్రియేట్ చేశారని డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరించారు. మార్గమధ్యలోనే రాజేశ్, స్వాతి బాటిల్ లో పెట్రోల్ కొనుగోలు చేశారని చెప్పారు. సుధాకర్ రెడ్డి హత్య తర్వాత దూరంగా వెళ్లి సహజీవనం చేయాలనుకున్నారని తెలిపారు. సుధాకర్‌రెడ్డిని హత్యచేసిన తర్వాత ముఖంపై పెట్రోలు పోసి కాల్చుకుని, దానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించి సుధాకర్‌రెడ్డి స్థానంలోరాజేష్ ను తీసుకొచ్చేందుకు ప్లాన్ వేసింది స్వాతి. అయితే రాజేష్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు, వాళ్ల నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాయి. అనుమానం నిజమేనని నిర్ధారించుకున్న సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వాతి-రాజేష్‌ డ్రామాను బట్టబయలు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12271
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author