నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తో అవగాహనా ఒప్పందం.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తో అవగాహనా ఒప్పందం.
December 15 22:47 2017
సింగపూర్,
పరిపాలనా విధానాల మెరుగుదల-వ్యవస్థల బలోపేతం,మెగురైన ఫలితాలు,ఇండిపెండెంట్ ఆడిట్ ఆఫ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్,కీ ఫెర్పార్మెన్స్ ఇండికేటర్స్ మరియు మాస్టర్ ప్లాన్ ఆన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మూడు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,దినేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మధ్య గురువారం సింగపూర్ తో అవగాహనా ఒప్పందం కుదిరింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్,సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ డీన్ ప్రొపెసర్ కిషోర్ మహబూబాని,ఇతర ప్రతినిధుల మధ్య ఈఅవగాహనా ఒప్పందం కుదిరింది.ఆర్దిక రంగం,ఇతర అంశాలపై సీనియర్ అధికారులు,ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు ఈవిశ్వవిద్యాలయం ద్వారా జరగనున్నాయి.పెట్టుబడులు విస్తృత స్థాయిలో ఆకర్షించేందుకు కూడా ఈఒప్పందం దోహదపడనుంది.అంతేగాక పబ్లిక్ పాలసీల రూపకల్పనలోను,పరిపాలనలో మోడల్స్,కేస్ స్టడీస్,సెమినార్లు,పరిశోధన మరియు క్షేత్ర సందర్శనలు వంటి వాటికి తోడ్పాటును అందేందుకు అవకాశం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తోపాటు ఆసియాన్చైనాలలో పెట్టుబడులకు అవకాశాలు,పబ్లిక్ పాలసీల రూపకల్పన,ఆర్ధిక పరిస్థితులు వంటి అంశాల్లో సివిల్ సర్వెంట్లు స్టడీకి అడ్వాన్సు ఎగ్జిక్యూటివ్ శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ఆసియా కాంపిటిటివ్నెస్ ఇనిస్టిట్ట్యూట్(ఎసిఐ)ఒక వేదికగా వ్యవహరిస్తుంది.అంతేగాక రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఇండిపెండెంట్ ఆడిట్ ఆఫ్ ది రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ మరియు కీ ఫెర్మాన్మెన్స్ ఇండికేటర్స్ లో క్వాలిటీ ఎఫెక్టివ్ నెస్ ద్వారా సంబంధిత లబ్దిదారులకు లబ్దికలిగించే విధంగా ప్రోగ్రామ్స్ రూపకల్పనకు ఈఎసిఐ దోహదం చేస్తుంది. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల ఆకర్షణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎసిఐ,లీ కున్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నేషనల్ యూనివర్సిటీ ఆప్ సింగపూర్ లు పరిశోధన,ఎకనమిక్ కాంపిటిటివ్ నెస్ కు సంయుక్తగా పనిచేసేందుకు ఈఒప్పందం అన్ని విధాలా దోహదపడుతుంది.అలాగే సులభతర వాణిజ్యంలో మెరుగైన ర్యాంకు సాధనకు కూడా ఉపయోగపడుతుంది.ఈఅవగాహనా ఒప్పందంలోని వివిధ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు  రాష్ట్ర ప్రణాళికాశాఖలోని విజన్ మేనేజిమెంట్ యూనిట్రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖలు నోడలు ఏజెన్సీలుగా అవసరమైన తోడ్పాటును అందిస్తాయి.ఈఅవగాహనా ఒప్పందం కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ డీన్ ప్రొ.కిశోర్ మహబూబానీల తోపాటు రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్త,విజన్ మేనేజిమెంట్ యూనిట్ కన్సల్టెంట్ తులిక అవని సిన్హా,లీ క్యుయాన్ య్యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అసోసియేట్ ప్రొపెసర్ ట్యాన్ ఖీ జియాప్తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12288
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author