విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరిన్ని నిజాలు

విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరిన్ని నిజాలు
December 16 15:57 2017
హైద్రాబాద్,
సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసిన నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరిన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. తన కుమారుడి మరణానికి అతడి భార్య వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్‌కు కూతురు కుందన అంటే ప్రాణమని, నిత్యం పాప గురించే తపించే వాడని వారు చెబుతున్నారు. ఇటీవల భార్య కూతుర్ని దూరం చేయడం అతణ్ని కలచివేసిందని దీంతో అతడు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని వారు చెప్పారు.విడాకులు తీసుకోవడం కోసం వనిత మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని విజయ్ తండ్రి సుబ్బారావు తెలిపారు. నా కుమారుడికి హెచ్‌ఐవీ లేదని, ఆ వ్యాధే ఉంటే వెంటనే విడాకులు వచ్చేవని తెలిపారు. పెళ్లయ్యాక ఏడేళ్ల తర్వాత పుట్టాడు, ఎంతో గారాబంగా పెంచామని చెప్పారు. అలాంటి కొడుకు కళ్ల ముందే చనిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా మనవరాలు కుందనను కూడా వనిత చంపేస్తుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నా కొడుకు ఆఖరి కోరిక తీర్చాలని పోలీసుల్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.కాగా సూసైడ్ చేసుకోవడానికి ముందు రోజు కూడా విజయ్ కూతురి కోసం భార్య దగ్గరకు వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విజయ్ సాయి భార్య వనితతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ రికార్డులను పరిశీలించగా.. వనిత అతణ్ని హెచ్చరించిన విషయం బయటపడింది.
నా జీవితంతో ఆడుకున్న నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వనిత బెదిరించింది. ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా విజయ్‌ను బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వనిత, అడ్వొకేట్ శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12371
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author