ఎన్ కౌంటర్ చేసినవారిని ఆరెస్టు చేయాలి

ఎన్ కౌంటర్ చేసినవారిని ఆరెస్టు చేయాలి
December 16 16:03 2017
హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రం లో హత్యలకు పర్యాయపదం ఎన్ కౌంటర్ గా  మారిపోయిందని విరసం నేత వరవరరావు మండిపడ్డారు. ప్రభత్వ నిర్ణయం ప్రకారమే  ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని అయన ఆరోపించారు. శనివారం నాడు బాగ్ లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  భద్రాద్రి కొత్త గూడెం జిల్లా టేకులపల్లి హత్యా కాండను  ఖండిస్తూ ప్రజాసంఘాల  మీడియా  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరవరరావు తోపాటు  తెలంగాణా యునైటెడ్  ఫ్రంట్ కన్వీనర్ విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, పౌర హక్కుల సంఘం నేత లక్ష్మణ్, ఇతర  సంఘాల నేతలు పాల్గొన్నారు. వరవరరావు మాట్లాడుతూ భద్రాద్రి  కొత్తం గూడెం ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేసి వారిని సస్పెండ్  చేయాలని డిమాండ్ చేసారు. ప్రపంచ తెలుగు మహాసభలు నెత్తుటి ప్రాంగణములో జరుగుతున్నాయని అయన అన్నారు. విమలక్క మాట్లాడుతూ కవులకు రచయితలకు సున్నితమైన మనస్తత్వం మానవత్వం ఉంటుంది.  మానవత్వం చూపకుండా సిగ్గుమాలినతనం తో కేసీఆర్ కు భజన చేయడానికి కవులు కళాకారులు ఆ తెలుగు మహాసభలో పాల్గొంటున్నారని విమర్శించారు. ఇది చాలా సిగ్గుచేటు అని  అన్నారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, వారిన వెంటనే అరెస్ట్ చేయాలని.. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12377
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author