తెలుగు’ విందు భలే పసందు

తెలుగు’ విందు భలే పసందు
December 16 18:37 2017
హైదరాబాద్,
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన భోజన ఏర్పాట్లు అతిథులను, ఆహ్వానితులను విశేషంగా అకట్టుకున్నాయి. ఉప్పూకారాలు సంగీత సాహిత్యాల లాగా అందరి నాలుకలను నాట్యమాడించి శభాష్‌ అనిపించాయ్‌. శనివారం మధ్యాహ్నం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వచ్చిన అతిథులు, ఆహ్వానితులు విందు భోజనాన్ని తనివి తీరా ఆస్వాదించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సభలకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అలమరికలు లేకుండా అతిథులకు చక్కటి  భోజనాలను సమయానికి ఏర్పాట్లు చేసింది.  శనివారం రెండో రోజు మహాసభలు జరిగే ఎల్‌.బి. స్టేడియం, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, లలితా కళా తోరణంలో భోజన ఏర్పాట్లను పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి. సింగ్‌, కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ స్వయంగా పర్యవేక్షించారు. అతిథులతో కలిసి భోజనం చేశారు. భిన్న ప్రాంతాలు, భిన్న మనస్తత్వాలున్న ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది అతిథుల మెప్పు పొందిన ఈ వంటకాల విందు రహస్యం – తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఒక ప్రభుత్వ విభాగం పెళ్ళి భోజనం తరహాలో వండి వడ్డించడం సాహితీ ప్రియులందరికీ చిరస్మరణీయమైన అనుభూతి మిగిల్చింది. ఎంతగా ఆకట్టుకుందంటే తిన్నవారు వెళ్ళిపోతూ…రేపు ఏం చేస్తున్నారు, ఎల్లుండేం చేస్తున్నారని ఆసక్తి కనబరచడంతో నిర్వాహకుల ఆనందానికి అవధులు లేవు. వేదికలో ‘ఈరోజు భోజనం’ అంటూ పెద్ద అక్షరాలతో డిస్‌ప్లే బోర్డుపై ప్రత్యేకంగా ప్రదర్శించడంతో చాలామంది అతిథులు ఆ బోర్డు పక్కన సెల్ఫీలు దిగడం కనిపించింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12383
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author