ఈ రోడ్డుపై నడిచేది ఎలా….

ఈ రోడ్డుపై నడిచేది ఎలా….
December 19 13:55 2017
మహబూబ్ నగర్,
అసలే ఇరుకైన రోడ్డు అందులో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉండే రోడ్డు పరిస్థితి గుంతలమయంగా మారడంతో తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దాపురించినా పాలకులు, అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిష్టియన్‌పల్లి నుంచి మర్లు, శేషాద్రినగ ర్ వెళ్లే రహదారి అడుగడుగునా గుంతలమయంగా మారడంతో ఈ రోడ్డు ద్వారా ప్రయాణిం చాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రోడ్డును వెడల్పు చేయాలని స్థాని కులు కోరుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని అందులో ఉన్న రోడ్డు కాస్తా గుంతలు పడి ప్రమాదభరితంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాహనదారు లు వాపోతున్నారు. క్రిష్టియన్‌పల్లి నుంచి మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ, వెంకటే శ్వరకాలనీ, శ్రీనివాసకాలనీలకు వెళ్లాడానికి షార్ట్‌కట్ దారి కావడంతో వందలాది వాహనాలు శేషాద్రినగర్, మర్లు మీదుగా ఈ రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంవిఎస్ కళాశాల, క్రీస్తుజ్యోతి పాఠశాల క్రిష్టియన్‌పల్లిలో ఉండడంతో విద్యార్థులు సైతం ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు కొనసాగిస్తుంటారు. గుంతలమయంగా మారిన రోడ్డు వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలువురు ఈ రోడ్డులో ప్రమాదానికి గురై తీవ్ర గా యాల పాలైన ఘటనలు చాలానే ఉన్నాయని అయినప్పటికీ రోడ్డు మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిష్టియన్‌పల్లి ఎంవి ఎస్ కళాశాల కాంపౌండ్ పక్క నుంచి మొదలై శేషాద్రినగర్, మర్లు, షాషాబ్‌గుట్ట, టీచర్స్ కాల నీ, మెట్టుగడ్డ మెయిన్‌రోడ్డు వరకు ఉండే ఈ రోడ్డు అడుగడుగునా గోతులమయంగా మా రింది. దీంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలమయంగా మారి న రోడ్డు పై ప్రయాణం చేయడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని, డిస్క్, కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నామని ఆయా కాలనీవాసులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇరుకైన రోడ్డు కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రోడ్డు వెడల్పు చేస్తామని గతంలోనే పాలకులు, అధికారులు హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయా కాలనీల్లో సైతం మురుగు నీరు ఇళ్ల మధ్య ప్రవహిస్తున్నందున పందులకు నిలయాలుగా మారిపోయాయని ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందికి విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదని, దీంతో రోగాల బారినప డుతున్నామని, ఇళ్ల మధ్య మురుగునీరు ప్రవహిస్తుండడంతో దోమలు సైతం విపరీతంగా ఉన్నాయని, విష జ్వరాలు ప్రబలుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో మౌళిక వసతులు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని, కాలనీల దుస్థితిపై ఎన్నోసార్లు పాలకులకు, అధికారులకు మొరపెట్టుకున్నామని అయినప్పటి కీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవ తీసుకుని రోడ్డును బాగుచేయడం తోపాటు కాలనీల్లో మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని, అదే విధంగా వీధి దీపాలు లేనిచోట వాటిని ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆయా కాలనీవాసులు, వాహనదారులు కోరుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12474
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author