టెన్త్ విద్యార్ధులకు సర్వర్ కష్టాలు

టెన్త్ విద్యార్ధులకు సర్వర్ కష్టాలు
December 19 16:05 2017
విజయవాడ,
విద్యా శాఖ నిర్లక్ష్యం.. ఐటి విభాగం అత్యుత్సాహం వెరసి టెన్త్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చలికాలంలోనూ చెమటలు పడుతున్నాయి. మొరాయిస్తున్న సర్వర్‌తో విద్యార్థుల వ్యక్తిగత వివరాల నమోదు సమస్యగా మారింది. వివరాల నమోదుకు గడువు ముగియనున్నప్పటికీ, గడువు పొడిగింపు, తదితర అంశాలపై విద్యా శాఖ స్పందించకపోవం గమనార్హం. టెన్త్ విద్యార్థుల వ్యక్తిగత వివరాలను (నామినల్ రోల్స్) బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్‌ఈ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను విద్యా శాఖ ఆదేశించింది. సమయం తక్కువగా ఇవ్వడమే కాకుండా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థుల వివరాలను అప్‌లోడ్ చేసేందుకు వీలుగా సర్వర్ సామర్థ్యం లేకపోవడం విద్యార్థులు, ఉపాధ్యాయులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. అన్ని వివరాలు నమోదు చేశాక, సబ్మిట్ చేస్తే, ఆ వివరాలు వెబ్‌సైట్‌లో లోడ్ కావడం లేదు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు నెట్ సెంటర్ల నుంచి వివరాలు నమోదు చేయాలని విద్యార్థులకు చెబుతున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులు నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. గడువు ముంచుకొస్తున్న తరుణంలో సర్వర్ మొరాయింపు ఆందోళనకు గురి చేస్తోంది. వివిధ ప్రాంతాల్లోని నెట్ వేగం, లభ్యత వంటి అంశాలను విద్యా శాఖ ఐటి విభాగం పట్టించుకోకుండా గడువు విధించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గత సంవత్సరం ఒకసారి విద్యార్థి వివరాలు నమోదు చేసుకున్నాక, దానిని ప్రింట్ తీసుకుని తప్పులు సరిదిద్దుకునే వీలు కల్పించారు. దాని వల్ల విద్యార్థుల వివరాల నమోదులో ఎటువంటి తప్పులు లేకుండా చూసే వీలు కలిగింది. ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వకుండా, నేరుగా వివరాలు అప్‌లోడ్ చేసేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. దీంతో తప్పులు దొర్లితే, సరి చేయడం ఇక పెద్ద సమస్యగా మారనుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని పొరపాట్లు జరిగే వీలు ఉందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థుల్లో సగం మంది వివరాలే ఇప్పటి వరకూ నమోదు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు వివరాల నమోదులో పడుతున్న ఇక్కట్లను గుర్తించినా విద్యా శాఖ స్పందించకపోవడం గమనార్హం. టెన్త్ పరీక్షలు మార్చిలో జరుగుతున్న నేపథ్యంలో మరో 10 రోజులు పొడిగిస్తే, ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12508
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author