పోగాకు ఉత్పత్తులకు పొగబెడుతున్నారు.

పోగాకు ఉత్పత్తులకు పొగబెడుతున్నారు.
December 19 16:09 2017
ఒంగోలు,
పొగత్రాగటం హానికరం, కాన్సర్ కు కారక ఉత్పత్తులను భారతదేశం నిషేధించి, వాటికి కారణమైన పొగాకు ఉత్పత్తులను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు. పొగత్రాగటం క్యాన్సర్ కు కారణం అని పదే పదే చెప్పే ప్రచార చిత్రాలకు వేల కోట్ల వెచ్చిస్తుంది. ప్రభుత్వాలు స్వచ్ఛందంగా పొగాకు సాగు నుంచి వైదొలిగే రైతు లకు నష్టపరిహారం ఇచ్చి వారిని ప్రోత్సాహం ఇచినట్లయితే, ఎక్కువ మంది రైతులు ఈ పంటను పండించటం ఆపివేస్తారు. దీని మూలంగా పొగాకు ఉత్పత్తులను తగ్గిచటం ద్వారా ప్రజల ఆరోగ్యం కాపడుకోగలం. ప్రభుత్వాలు పొగాకు పంటను తగ్గించడం వల్ల లేదా నిషేధించటం వల్ల ప్రకాశం జిల్లాలో అధిక సంఖ్యలో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు, పొగాకు బోర్డు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో అధికంగా రైతులు పొగాకు పంటపై ఆధారపడేవారు. గత కొంత కాలంగా రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టడం, ప్రకృతి వైపరీత్యాలతో గత కొన్ని సంవత్సరాలలో అధిక నష్టాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అమ్ముకునే సమయంలో కొనేవారులేక గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారు. ఈ నష్టాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్కెట్ మొత్తం ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోయి, పోటీ లేక పోవటం వల్ల గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 50 వేల హెక్టార్లలో పొగాకు బోర్డు ఈ సంవత్సరం అనుమతి ఇచ్చింది. ఒక వేల పంటను రక్షించుకొని కొంత ఎక్కువ పండించిన రైతులకు బోర్డు అధిక సెస్సులు రూపంలో వసూలు చేస్తున్నారు. ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంటను పండిచటం సరైనది కాదు, ఇది మా నెగటివ్ లిస్టులో వున్నది మేము కొనుగోలు చేయటం కుదరదు అందువల్ల పొగాకు వేయడం మనుకోవటం మంచిదని సలహా ఇస్తున్నారు. పొగాకు సాగుకు అధిక ఖర్చులు, కొనేవారులేక ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారు.
2003వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, ఫ్రెమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాక్ కంట్రోల్ వారు ఒక ఒప్పందాన్ని తయారు చేశారు. ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని ఉత్పత్తులను తగ్గంచాలని నిర్ణయించారు.  అందువల్ల రైతులు కూడా స్వచ్ఛందంగా పొగాకును వేయడం మానుకుంటాం దానికి గాను మా దగ్గర నుంచి బోర్డు వారు అధిక దిగుబడి కింద సెస్సుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని మాకు కేటాయించి ఒక భ్యార్నీకి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు.పొగాకు సాగు నుంచి వైదొలిగే రైతులకు నష్టపరిహారం ఇచ్చి వారిని ప్రోత్సహించినట్లయితే ఎక్కువ మంది రైతులు ఈ పంటను పండించడం ఆపేస్తామని అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12511
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author