బెల్ట్ షాప్ పై ఎక్సైజ్ శాఖ దాడి

బెల్ట్ షాప్ పై ఎక్సైజ్ శాఖ దాడి
December 19 20:26 2017
నెల్లూరు,
నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్  నగర్ ప్రాంతంలో  బెల్ట్ షాప్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం నాడు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 మద్యం బాటిళ్లు ను స్వాధీనం చేసుకున్నారు.  గూడూరుకి చెందిన పల్లెమాల ఆనంద్ గత కొంతకాలంగా యన్ టి ఆర్ నగర్ ప్రాంతంలో ఓ బెల్ట్ దుకాణం ఏర్పాటుచేసి మద్యం అమ్మకాలు జరుపుతున్నాడని అధికారులు వెల్లడించారు. జాతీయ రహదారి దగ్గర కావటం, మద్యం అమ్మకాలు జోరు అందుకోవడంతో స్థానికులు  అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ దాడులు చేశారు. యన్ టి ఆర్ నగర్ మద్యం దుకాణంకి అనుబంధం గా ఈ బెల్ట్ షాపుని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12518
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author