పెండింగ్ పనులు వేగవంతం : స్పీకర్ కోడెల

పెండింగ్ పనులు వేగవంతం : స్పీకర్ కోడెల
December 19 20:30 2017
సత్తెనపల్లి,
సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గ నాయకులు, ప్రజలతో సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో జరుగుతున్న, జరిగిన పనులపై ఆరా తీసారు. గ్రామాల్లో పంచాయతీ పరిధిలో ఖర్చు కాకుండా ఉన్న నిధులను వెంటనే అభివృద్ధి పనులకు ఉపయోగించండని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పెండింగ్ రోడ్లు, శ్శశానవాటికలు, ఇళ్ల ను వెంటనే పూర్తిచేయాలి. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, 14వ పైనాన్స్ ద్వారా ఇస్తున్న నిధులను ఉపయోగించుకోని వెంటనే రోడ్లు పూర్తి చేసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామాల్లో సైతం బస్సులు తిప్పడానికి ఆర్టీసీ సిద్దంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో  బస్సు సౌకర్యం ఏర్పాటుపై ఆర్టీసీ ఎండీ  రాసిన లేఖను చూపించారు. ఈ నేపధ్యంలో గ్రామాల్లో ప్రజలు బస్సులనే ఎక్కాలన్నారు. సమావేశం సందర్బంగా అయన దుల్హన్ పధకం కింద పేద ముస్లిం యువతుల పెళ్లిలకు 50వేల రూపాయలను అందించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12521
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author