సేంద్రియంతో సాగు బాగు

సేంద్రియంతో సాగు బాగు
December 19 22:56 2017
ప్రకాశం,
సంప్రదాయ పంటలతో నష్టాలు వస్తుండడంతో ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ రైతాంగం పండ్లతోటలపై దృష్టి సారించింది. ఒకప్పుడు ఇక్కడి రైతులు వాణిజ్య పంటలు అధికంగా సాగుచేసేవారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారు. అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక నష్టాలను చూశారు. ఈ క్రమంలో తమ ఆలోచనలు మార్చుకున్నారు.  ప్రత్యామ్నాయంగా పండ్లతోటలు సాగుకు రైతులు మొగ్గు చూపారు. పండ్లతోటల పెంపకంకు రైతులు అలవాటుపడ్డారు.  గతంలో బత్తాయి తోటలు బాగా సాగుచేసేవారు.  అయితే అనుకున్నస్థాయిలో దిగుబడి రాక బాగా సష్టపోయారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పండ్లతోట పెంపకం విధానంను తెలుసుకున్నారు.  కర్నాటక, తమిళనాడు, అనంతపురం  ప్రాంతాల్లో సాగుచేస్తున్న మేలురకం దానిమ్మ పంట గురించి వివరాలు తెలుసుకుని దానిమ్మ సాగుకు సిద్దమయ్యారు.
ఎపీ పామ్స్ ద్వారా వర్మీ కంపోస్టు యూనిట్ ఏర్పాటు చేసి దానిమ్మ మొక్కలకు ఎరువుగా వేశారు.   రసాయనాలను వాడకుండా సేంద్రియ పద్ధతులనే అవలంభించారు.  ఫలసాయం దిగుబడికి వచ్చి లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు…ఆ తోటలో ప్రతిరోజూ 30మందికి ఉపాధినిస్తున్నారు. ఫలసాయం మంచి దిగుబడి వచ్చినా… పండ్ల కొనుగోలు సమయంలో మాత్రం కొర్రీలు వేస్తున్నారు. ఒక్కోసారి తక్కువ ధరకు పళ్లను అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుందని…స్థానికంగా హార్టీ కల్చర్ ఆధ్వర్యంలో పళ్ల అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని రైతులు ఆశపడుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12577
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author