విజయవాడలో జై సింహ ఆడియో

విజయవాడలో జై సింహ ఆడియో
December 20 18:11 2017
విజయవాడ,
నందమూరి నట సింహం బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జై సింహా. సంక్రాంతి కోడిగా బరిలోకి దిగనుంది. జనవరి 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్దమైంది చిత్ర యూనిట్. బాలయ్యకు జోడిగా నయనతార, నటాషాదోషి, హరిప్రియలు నటించారు. ఆడారు. పాడారు. దుబాయ్ షెడ్యూల్ పూర్తి అయింది. ఫలితంగా ఇప్పుడు జై సింహా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది యూనిట్. ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ని డిసెంబర్ 24న విజయవాడ వేదికగా వజ్రా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో కంటే అక్కడైతే బాలయ్య ఫ్యాన్స్ రావడానికి బాగా వుంటుందని అంతా భావిస్తున్నారు.హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణతోపాటు ఇతర నటీనటులు, రాజకీయ నేతలు ఈ ఫంక్షన్‌కు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ నేత, అందులోను సి.ఎం చంద్రబాబు వియ్యంకుడు. అందుకే ఏర్పాట్లు గ్రాండ్ గానే ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో వైజాగ్, అమరావతి, గుంటూరు, బెజవాడలలో ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరుపుతున్నారు సినీ నిర్మాతలు. ఫలితంగా కొత్త జోష్ వస్తోంది. అభిమానుల కోసం రొటీన్ గా భిన్నంగా నిర్మాతలు వ్యవహరించడం కలిసొచ్చే అంశం. నాని, సాయి పల్లవి నటించిన ఎం.సి.ఎ వేడుకలను హైదరాబాద్ ను కాదని… ఓరుగల్లులో నిర్వహించిన సంగతి తెలిసిందే.జై సింహా దర్శకుడు కె.ఎస్.రవికుమార్. చాలా కాలం తర్వాత కె.ఎస్.రవికుమార్ తెలుగులో సినిమా చేస్తున్నారు. అందులోను బాలయ్యతో ఫస్ట్ టైమ్ చేస్తుండటంతో జై సింహాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న ఈ మూవీకి నిర్మాత సి.కళ్యాణ్. రాజకీయ నేపథ్యం కూడా సినిమాలో ఉండనుంది. నందమూరి అందగాడికి జోడీగా ఈ మూవీలో నయనతార నటిస్తోంది. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో వస్తున్న థర్డ్ మూవీ ఇది. ఇటీవల వచ్చిన జై సింహా ఫస్ట్ లుక్ స్టిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ జైసింహాతో సంక్రాంతికి ఏ రేంజ్ లో సందడి చేస్తాడో చూడాలి. అసలే సంక్రాంతికి చాలా సందడి ఉంటోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12682
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author