ఎన్టీఆర్ గుర్తుకు రాకపోవడం దారుణం

ఎన్టీఆర్ గుర్తుకు రాకపోవడం దారుణం
December 20 18:23 2017
హైదరాబాద్,
తెలంగాణ కవులు అందె  శ్రీ , గద్దర్, విమలక్క కనిపించలేదు కానీ సినిమా ఆర్టిస్టులు కనిపించారా ఈ ప్రభుత్వానికి అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండపడ్డారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ సభలకు వచ్చిన సినిమా నటులకు కుడా ఎన్టీఆర్ గుర్తుకు రాకపోవడం దారుణమని అన్నారు. నేను ఒక కాంగ్రెస్ వాదిని. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడం తో నాకే బాధేసిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. పక్క రాష్ట్రానికి పెళ్ళిలకు వెళ్తారు కానీ చంద్రబాబు ని పిలవరా అని నిలదీసారు. సీఎం కేసీఆర్ కి భజన చేసేవారినే.. తెలుగు మహాసభకు ఆహ్వానించారని అయన అన్నారు. ఇది భజన సభ, టీఆరెస్ సభలా ఉంది. కాని తెలుగు మహాసభ లా లేదని అన్నారు. హైదరాబాద్ లో గెలిచినా ఏ  ఒక్క  టీఆరెస్ కార్పొరేటర్ సంతోషంగా లేడు., సర్కార్  ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయన విమర్శించారు. ఎవడబ్బ సొమ్మని ప్రతిసంవత్సరం ఇంత ఖర్చు తో సభలు నిర్వహిస్తావని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ వాపు చూసి సంతోషిస్తున్నావ్, టీఆరెస్ కి టైం దగ్గర పడిందని హెచ్చరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12688
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author