మిషన్ కాకతీయ మీడియా అవార్డ్స్ 

మిషన్ కాకతీయ మీడియా అవార్డ్స్ 
December 20 19:52 2017
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక  మిషన్ కాకతీయ పథకం విజయవంతంగా  మూడేళ్ళు పూర్తి చేసుకొని నాలుగో ఏట అడిగిడుతున్నది.నాలుగవ దశ కార్యక్రమం జనవరిలో ప్రారంభమవుతున్నది.  ఎండిపోయిన పొలాల్లో ఈ కార్యక్రమం  సిరులు పండిస్తోంది. మోడుగా మారిన  రైతు జీవితంలో బంగారు పూలు పూయిస్తోంది. మిషన్ కాకతీయ భేష్ అంటూ ప్రపంచం మొత్తం కీర్తిస్తోంది.మిషన్ కాకతీయ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిస్తున్నట్టు నాబార్డుకు చెందిన ‘ నాబ్ కాన్” సంస్థ అధ్యయనంలో తేలింది.  ఇందుకు ప్రభుత్వ కృషి ఒక ఎత్తు అయితే, మీడియా పాత్ర కూడ మరో ఎత్తు. మిషన్ కాకతీయ పథకం గొప్పదనాన్ని మీడియా గుర్తించింది. మీరు ఇచ్చిన కవరేజి చాలా మందిని కదిలించింది.వ్యక్తులు,  స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసింది. దేవుని పెండ్లికి ఊరంతా పెద్దలే అన్నట్లు తలో చెయ్యి వేసి మిషన్ కాకతీయ ను వియవంతంగా నడిపిస్తున్నారు. అందుకే మీడియా కృషిని, పాత్రను గుర్తించి ప్రభుత్వ ఏటా చంద్రునికో నూలుపోగు లా అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ ఏడు కూడా చాలా వార్త సంస్థలు, జర్నలిస్టు మిత్రులు చెరువుల జలకళ మీద, సామాజిక, ఆర్ధిక రంగాల్లో గ్రామీణ జన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ కార్యక్రమం పైన  అనేక వార్తలు రాశారు. అందుకు మిమ్ములను మరోసారి సాదరంగా సత్కరించుకోవాలని భావిస్తోంది ఇరిగేషన్‌ శాఖ. తెలంగాణ జన జీవితంపై మిషన్ కాకతీయ పథకం ఎలాంటి ప్రభావం చూపుతున్నదనే అంశాలపై   ఎంట్రీలను పంపవలసినదిగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ఓఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే బుధవారం నాడు  ఒక ప్రకటనలో కోరారు.2017 జనవరి 1 వ తేదీ నుంచి 2017  డిసెంబర్ 31 వరకు పత్రికలలో అచ్చయిన,  టివి న్యూస్  ఛానళ్లలో ప్రసారమైన కథనాలు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. ఎంట్రీలు పంపేందుకు చివరి తేదీ 2018 జనవరి 31.ఈ కింద వివరించిన అంశాలపై ఎంట్రీలు కేంద్రీకృతమై ఉండాలి.1.మిషన్ కాకతీయ ఫలాలపై విశ్లేషణ.2.పంట దిగుబడులపై, రసాయనిక ఎరువుల వాడకంపై పూడిక మట్టి  ప్రభావం.3. చెరువు పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ రంగాలు, వృత్తులలో వచ్చిన మార్పులు.4. వలసల నివారణ.5 . భూగర్భ జలసంపదపై ఎం.కే.ప్రభావం.6. ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులలో వచ్చిన గుణాత్మక మార్పులు. 10. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల. 11.గొలుసుకట్టు చెరువుల చరిత్రపై పరిశోధన,విశ్లేషణ.12.ఇవి కాకుండా చెరువుల పునరుద్ధరణ ఫలితాలపై వినూత్న కోణాల్లో, సృజనాత్మక  కధనాలు కూడా పంపవచ్చు.13.జీవ వైవిధ్యం(బయో డైవర్శిటీ) పెరుగుదల.14.చేపల పెంపకానికి దోహదం.క్యాటగిరీలు : 1. ప్రింట్ మీడియా. 2 .ఎలక్ట్రానిక్ మీడియా.3. ఆన్ లైన్ మీడియా. 4. వీడియో జర్నలిస్టులు.5.ఫోటోగ్రాఫర్లు.6.ఫ్రీ లాన్సింగ్ 7.విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక గ్రంధాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, వీడియో సాంగ్స్ . ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగాలలో మూడు బహుమతుల చొప్పున విడివిడిగా  ఉంటాయి*మొదటి బహుమతి కింద 1 లక్ష రూపాయలు, *రెండవ బహుమతి కింద 75 వేల రూపాయలు, *మూడవ బహుమతి కింద 50 వేల రూపాయల ప్రదానం జరుగుతుంది.న్ లైన్ మీడియా, ఫ్రీ లాన్సింగ్ విభాగాలలోనూ, అలాగే వీడియో జర్నలిస్టులు, ప్రెస్ ఫోటో గ్రాఫర్లకు సైతం విడిగా  ప్రత్యేక బహుమతులుంటాయి.ఎంట్ర్రీ పంపేవారు  పత్రికల  వార్తా కటింగు, టివి  చానళ్ళ వార్తల క్లిప్పింగులు (సి.డి.), వీడియోలు, ఫోటోలు….అన్ని క్యాటగిరీలలోని  ఇతర అన్ని ఎంట్రీలు 5 చొప్పున పంపాలి.నేరుగా కాని, పోస్టు/కొరియర్ ద్వారా కానీ పంపాలి.ఎంట్రీలు పంపవలసిన చిరునామా;శ్రీధర్ రావు దేశ్ పాండే,ఓ.ఎస్.డి.ఇరిగేషన్ శాఖ,డి.బ్లాక్., గ్రౌండ్ ఫ్లోర్ ,సేక్రేటేరియట్.హైదరాబాద్.తెలంగాణకు పంపాల్సి ఉంటుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12729
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author