ఈ పాస్ మిషన్ ద్వారా ఎరువుల అమ్మకాలు

ఈ పాస్ మిషన్ ద్వారా ఎరువుల అమ్మకాలు
December 20 20:30 2017
 హైదరాబాద్
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 1, 2018  నుంచి రాష్ట్రం లో ఈ పాస్ మిషన్ ద్వారా ఎరువుల అమ్మకాలు అమలు కానున్న, నేపద్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మరియు సహకార శాఖ అధికారులతో దూరదృశ్య సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, మాట్లాడుతూ రాష్ట్రంలో 7236 ఎరువుల డీలర్లకు కాను 6300  ఈ పాస్ మిషన్లు సరఫరా జరిగాయని తెలిపారు. ఇప్పటి వరకు  జిల్లాకు వచ్చిన  ఈ పాస్ మిషన్లను  సత్వరమే ఆక్టివేట్ చేసుకోవాలని, వివరాలను జిల్లా నిర్ణీత కంపెనీ ప్రతినిధులకు తెలియజేయాలని, వాటి లోటుపాట్లను వెనువెంటనే  సరిదిద్దుకోవాలని చెప్పారు.  అలాగే ప్రాథమికి వ్యవసాయ సహకార సంఘాల పాస్కి సంబంధించిన ఎరువుల డీలర్లకు కూడా  ఈ పాస్ మిషన్లను ఆర్టివేట్ చేయాలని తెలిపారు.  అలాగే ఎరువులు వ్యాపారం చేయని డీలర్లను తొలగించాలని ఆదేశించారు.  ఈ విషయమై  21,22, 23 తేదీలలో జిల్లాలో ఉన్న సహాయ వ్యవసాయ సంచాలకులు మండల వారీగా డీలర్లతో సమావేశాలు జరుపుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ పాస్ మిషన్లు ఆక్టివేట్ చేసుకోవాలని, లోటుపాట్లను వెనువెంటనే కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకరావాలని ఆదేశించారు.  అలాగే ప్రతి జిల్లాకు/ రెండు జిల్లాలకు ఒకరిని ఒక  ప్రత్యేక కంపెనీ ప్రతినిధిని నియమించాలని  రాష్ట్ర ఎరువుల కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.  ఇందులో అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు.  2017 డిశంబరు 24 అర్థరాత్రి నుంచి భారత ప్రభుత్వం అన్ని ఈ పాస్ మిషన్లలో జీరో స్తోక్ బాలెన్సు  చేస్తున్నందున 25 తేదీ నుండి ఈ పాస్ మిషన్ల యొక్క ఖచ్చితంగా చేసుకోవాలని అన్నారు.  దానికి 25, 26,  27 తేదీలలో షెడ్యూల్ తయారు  చేసుకొని జిల్లాల్లో ఉన్న అన్ని ఈ పాస్ మిషన్లలో స్టాక్ వివరాలను పొందుపరచాలని అన్నారు మరియు అట్టి స్టాక్ వివరాలను సంబంధిత మండల వ్యవసాయ అధికారి ధృవీకరించాలని తెలిపారు.  భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జనవరి 1, 2018 నుంచి ఎరువుల అమ్మకాలు పూర్తిగా ఈ పాస్ మిషన్ల ద్వారానే చేపట్టాలని, దీనికి విరుద్ధంగా ఏ డీలరైనా అమ్మకాలు జరిపినట్లయితే వారి లైసెన్సులు రద్దు చేయబడతాయని తెలిపారు.  కాబట్టి దీనికి జిల్లా వ్యవసాయ అధికారులు అందరూ సంబంధిత రాతపూర్వక తాఖీదులు ఎరువుల డీలర్లకు ఇవ్వాలని, ఈ విషయం కలెక్టర్లతో చర్చించి, ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో విస్తృత ప్రచారం జరపాలని అలాగే లోకల్  కేబుల్ టి.వి.ల ద్వారా, ప్రెస్ మీట్, లోకల్ టి.వి.లలో ప్రచారం మొదలగునవి చేపట్టాలని  వీలైన చోట్ల రైతుల  యొక్క సహాయం కూడా తీసుకోవాలని సూచించారు.   2018 జనవరి 1 తర్వాత ఏ డీలర్లు ఈ పాస్ మిషన్లు ద్వారా ఎరువుల అమ్మలేదో వారి లైసెన్సులు రద్దు చేస్తూ సంబంధిత, జిల్లా వ్యవసాయ అధికారి, సహాయ వ్యవసాయ అధికారి మరియు  మండల వ్యవసాయ అధికారులపై శాఖపరమైన చర్యలు తప్పవని ఉద్ఘాటించారు.  ఈ సమావేశానికి వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్.  సహకార శాఖ అధికారులు, రాష్ట్ర స్థాయి కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12745
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author