పైరసీపై అల్లు శిరీష్, దిల్ రాజు పిర్యాదు

పైరసీపై అల్లు శిరీష్, దిల్ రాజు పిర్యాదు
December 20 21:59 2017
హైదరాబాద్,
పైరసీ సినిమాల తో సినిమా నిర్మాతలే కాదు 24క్రాఫ్ట్స్ వారు నష్టపోతున్నారని తెలుగు హీరో అల్లు శిరీష్ అన్నారు. చిన్న పిల్లలకి 500,1000 రూపాయలు ఆశ పెట్టి సెల్ ఫోన్స్ లో పైరసీ చేయిస్తున్నారని అయన అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పైరసీ ని అరికట్టే విషయంలో సిని పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి సహకరాన్ని అందిస్తుంది. జవాన్ ప్రొడ్యూసర్ ను పైరసీ మాఫియా వాళ్ళు 3లక్షలు డిమాండ్ చేశారని అన్నారు. పైరసీ పై సమాచారాన్ని అందిస్తే నిర్మాతల మండలి తరుపున బహుమతులు ఇస్తామని వారన్నారు. సంపన్న కుటుంబాలు వారే ఎక్కువుగా పైరసీకి అలవాటు పడుతున్నారని దిల్ రాజు అన్నారు. బుధవారం నాడు దిల్ రాజు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కలిసి పైరసీపై ఫిర్యాదు చేసారు.  సీసీఎస్ ఏసీపీ రఘువీర్ మాట్లాడుతూ పైరసీ ని అరికట్టే విషయం లో కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. పైరసీ అరికట్టే అంశంపై ఐటీ శాఖ కార్యదర్శికి ఇప్పటికే కొన్ని సిఫార్సులు చేసాం. బిట్ కాయిన్ రూపంలో పైరసీ వాళ్ళు లావాదేవీలు నడుపుతున్నారని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12748
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author