ముందుకు సాగని మరుగుదొడ్డి పథకం

ముందుకు సాగని మరుగుదొడ్డి పథకం
December 20 22:22 2017
వికారాబాద్,
ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి ఉండాలనే ఉద్యేశంతో సంపూర్ణ స్వచ్ఛ గ్రామాలు తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ పథకాన్ని తీసుకువచ్చింది. మరుగుదొడ్డి ఉంటే మనుషులకు ఎలాంటి రోగాలు రావని, ఆఘయిత్యాలు జరువని ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నేరుగా మరుగుదొడ్డి నిర్మించుకుంటే లబ్ధిదారుడికి రూ.12 వేలు ఇస్తుంది. జిల్లాలో 1,64,861 మంది కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు మంజూరయ్యాయి. ఇందులో పథకం ప్రారంభం కాకముందే 639 మంది లబ్ధిదారులు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద 839 పూర్తి చేసినారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 3,276 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్‌బీఏ కింద 10,394 మరుగుదొడ్లును పూర్తి చేసినట్లు తెలిపారు. మూడు స్కీంలలో మొత్తం 19,708 నిర్మించామని పేర్కొంటున్నారు. ఇంకా జిల్లాలో 67,885 కట్టాల్సి ఉండగా, ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం చివరి దశకు చేరుకుంది. కాని, ప్రభుత్వం లక్ష్యం చేరుకోలేకపోయింది. ఒక పక్క ప్రతి రోజు సమీక్ష సమావేశాలు నిర్వహించి వ్యక్తి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు కసరత్తును వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తూన్నా అధికారులు కూడా గ్రామాల్లోకి వెళ్లి నామామత్రంగా అవగాహన కల్పిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని సగానికి కూడా చేరుకోలేకపోయారు. అయితే, ఈ నెల చివర వరకు 18 మండలాల్లో 30 గ్రామాలు ఓడీఎఫ్‌గా ఎంపికవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి 4 స్వచ్ఛ గ్రామాలుగా ప్రకటించేందుకు మరుగుదొడ్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు.జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు గ్రామాలు ఎంపిక చేశారు. దీంతో, కొందరు సొంత డబ్బులతో నిర్మించుకోగా, మరికొందరు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్మించుకున్నారు. మండలంలోని పాతూరు, నారాయణపూర్, గొట్టిముక్కల, ధారూరు మండలం గోధుమగూడ తదితర గ్రామాల్లో కాంట్రాక్టర్ నిర్మించారు. అటు అధికారులు మరుగుదొడ్లు వేగవంతం చేయాలని లబ్ధిదారులకు పరుగు పెట్టడంతో వారు సదరు కాంట్రాక్టర్‌ను త్వరగా మెటీరియల్ తీసుకువచ్చి నిర్మించాలని కోరుకుంటున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ రోజు వందల రింగులను, కప్పులను నాసిరకంగా తయారు చేసి మరుగుదొడ్లకు ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రింగులు, కప్పులు తయారీ కేంద్రం వద్ద నుంచి వాహనంలోకి ఎక్కిస్తున్నపుడే పగిలిపోతున్నాయి. మరికొన్ని రింగులు పగుళ్లు వచ్చిన గుంతల్లో అలాగే అమార్చుతున్నారు. ఇలా నాసిరకం రింగులు,కప్పులు వేయడంతో కొన్ని రోజుల తర్వాత గుంతల్లోంచి దుర్వాసన వెదజల్లే ప్రమాదం ఉం పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. కనీసం రింగులు, కప్పులు తయారు చేసిన తర్వాత రెండు మూడు రోజులు నీళ్లు పడుతూ ఆరబెట్టాల్సి ఉంటుంది. కానీ అధికారులు మరుగుదొడ్లు వేగంగా నిర్మించుకోవాలని చెప్పడంతో హడావుడిగా వాటిని తయారు చేసి ఉపయోగిస్తున్నారు.వికారాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మాణం కోసం గుంతలు తీసుకుంటే మొదటి బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పడంతో గ్రామం మొత్తం గుంతలు తీసుకున్నారు. కాని ఒక్కరికి కూడా మొదటి దశ బిల్లులు అందలేదు. అధికారులు పనులు ఎంత వేగంగా చెబుతారో బిల్లులు కూడా అలాగే ఇవ్వాలని లబ్ధ్దిదారులు కోరుతున్నారు. గ్రామాల్లో అసలే పేదవారు ఉంటారు. దశల వారీగా బిల్లులు చెల్లిస్తేనే సకాలంలో మరుగుదొడ్లు నిర్మా ణం జరుగుతాయి. అందుకు అధికారులు చొరవ చూపాలి. ఈ నెల చివరి వరకు 18 మండలాల్లో 30 గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా ఎంపిక చేస్తాం. ఇప్పటికే గ్రామాల్లో చివరి దశల్లో మరుగుదొడ్ల పనులు జరుగుతున్నాయి. బిల్లులు కూడా నిర్మించుకున్న వెంటేనే పోటో అప్‌లోడు చేసి బిల్లులు ఇస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ముందుగా బిల్లులు ఇస్తే నిర్మాణం దశలోనే వదిలేశారు. మళ్లీ డబ్బులు ఇస్తేనే నిర్మించుకుంటామని మొండికేస్తున్నారు. దీంతో నిర్మించుకున్న రెండు మూడు రోజుల్లోనే బిల్లులు ఇస్తున్నాం. చాలా గ్రామాల్లో లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకుని తర్వాత డబ్బులు తీసుకుంటున్నారు. కొందరు మాత్రం బిల్లులపై అధారపడుతున్నారు. నాసిరకం రింగుల వాడకం లేకుండా చూస్తాం. అలాంటివి మా దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటాం
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12757
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author