క్లైమాక్స్ కు చేరుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు

క్లైమాక్స్ కు చేరుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు
December 21 10:59 2017
హైద్రాబాద్,
తెలుగు సినీ పరిశ్రమను వణికించిన డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. శాంపిల్స్ సేకరించినవారిలో ఒకరు మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఈ కేసు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దాదాపు నెల రోజులకు పైగా హాట్ టాపిక్ గా నడిచిన మాదకద్రవ్యాల వినియోగం కేసులో పలువురు సినీ ప్రముఖులను అకున్ సబర్వాల్ సారథ్యంలోని ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించారు. విచారణలో పలువురి బ్లెడ్ శాంపిల్స్ సేకరించిన సిట్ బృందం వాటిని కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్ కు పంపింది. తాజాగా ఫోరెన్సిక్ పరీక్షలు ముగియటంతో నిపుణుల బృందం శాంపిల్స్ ను కోర్టుకు అందజేసింది. దీంతో త్వరలోనే చార్జిషీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమవుతోంది సిట్.
ఫోరెన్సిక్ సమర్పించిన నివేదికలో శాంపిల్స్ సేకరించిన వారి వివరాలను డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నదానిపై ఎఫ్ ఎస్ ఎల్ తను నివేదికను న్యాయస్దానానికి అందజేసింది. శాంపిల్స్ ఇచ్చిన వారిలో ఒకరి రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చినట్టు సమాచారం. పూరిజగన్నాధ్, సుబ్బరాజు, తరుణ్ ల విచారణ సుమారు పది గంటలకు పైగా విచారించిన సిట్ బృందం వీరి రక్త నమూనాలు, వెంట్రుకలు, గోర్లను పరిక్షల నిమిత్తం తీసుకుంది. డ్రగ్స్ పరిక్షల కోసం ప్రత్యేకించిన పరికరాలను దిగుమతి చేసుకున్న అధికారులు ఎట్టకేలకు రిజల్ట్ ను కోర్టును అందజేశారు. ఇక కోర్టు నుండి ఎక్సైజ్ అధికారులు సేకరించటమే తరువాయి తదుపరి చర్యలకు సిద్దం కానున్నట్టు సమాచారం.  టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జులైలో 12మందిని ప్రముఖులను ప్రశ్నించారు. అయితే ఈ కేసులో పూరీ, తరుణ్, సుబ్బరాజు నుంచి మాత్రమే  శాంపిల్స్ సేకరించారు. కెల్విన్ ముఠాతో వీరికి సంబంధాలున్నాయనేది అధికారుల అభియోగం. విచారణను ఎదుర్కొన్న వారిలో హీరో రవితేజ, నవదీప్ లతో పాటూ ఛార్మి, మొమైత్ ఖాన్ లు కూడా ఉన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12795
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author