పెళ్లి కాని ప్రసాద్ లకు గుండె జబ్బులు ఎక్కువ

పెళ్లి కాని ప్రసాద్ లకు గుండె జబ్బులు ఎక్కువ
December 21 11:21 2017
హైద్రాబాద్,
‘నాకు పెళ్లి కాలేదు.. హాయిగా బతికేయోచ్చు’’ అని భావిస్తున్నారా? అయితే… ఈ విషయం తెలిస్తే తప్పకుండా గుండెపోటు వస్తుంది. ఎందుకంటే.. పెళ్లైనవారి కంటే పెళ్లికానివారికే గుండె వ్యాధుల ముప్పు ఎక్కువట. అమెరికా హార్ట్ అసోసియేషన్‌ ఈ విషయం వెల్లడించింది. పెళ్లయిన హృద్రోగులతో పోల్చితే పెళ్లికాని రోగుల్లోనే చనిపోయే ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరే యూనివర్శిటీకి చెందిన మెడిసిన్ ప్రొఫెసర్ అర్షెద్ కుయుమ్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. సర్వేలో భాగంగా 6,051 మంది రోగులపై  పరీక్షలు నిర్వహించారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నవారు, విడిపోయినవారు, భర్త లేదా భార్య చనిపోయినవారు, ఎప్పటికీ పెళ్లి చేసుకోని గుండె వ్యాధిగ్రస్తుల్లో చనిపోయే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ పరిశోధన కోసం దాదాపు నాలుగేళ్లపాటు రోగుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అయితే, ఇప్పటికే గుండె సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మాత్రమే ఈ ప్రమాదం ఉందని, గుండె సమస్యలు లేని ఒంటరి వ్యక్తులు దీనిపై కలవరం పడక్కర్లేదని సర్వే స్పష్టం చేసింది. అయితే, ఏ కారణం వల్ల పెళ్లికానివారికి ఈ ముప్పు ఉంటుందనేది మాత్రం వివరించలేదు. ఈ నేపథ్యంలో పెళ్లికాని వ్యక్తులు గుండె వ్యాధులు పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12810
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author