పట్టించుకోనిపోలీసులు…. ఇష్టా రాజ్యంగా పార్కింగ్

పట్టించుకోనిపోలీసులు…. ఇష్టా రాజ్యంగా పార్కింగ్
December 21 15:14 2017
హైద్రాబాద్,
సికింద్రాబాద్‌ ప్రాంతంలోని మోండా మార్కెట్‌, ఎంజీరోడ్డు, ఆర్పీ రోడ్డు, మహంకాళి టెంపుల్‌ ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సికింద్రాబాద్‌ ప్రాంతం నుంచి ఏదైన ప్రమాదం జరిగితే గాంధీ ఆస్పత్రికి పేషంట్లను తీసుకెళ్లాలంటే ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉండాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అడ్డదిడ్డంగా రోడ్డుపై పార్కింగ్‌ చేసే వాహనాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ గణేష్‌ టెంపుల్‌ వద్ద వాహనదారులు గుడికి వెళ్లాలన్నా రోడ్డుపక్కనే పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య మరింత ఎక్కువవుతుంది. రాకపోకలు చేసే వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. ఫుట్‌ఫాత్‌లపై ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారిపై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు
సికింద్రాబాద్‌ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, రైతి ఫైల్‌ బస్టాండ్‌, దుకాణాల ముందు ఇష్టారాజ్యంగా వాహనాలను ఉంచుతున్నారు. దీంతో ఇక్కడ పార్కింగ్‌ సమస్యతో ఉదయం, సాయంత్రం వాహనదారుల రాకపోకలకు సమస్యగా తయారైంది. జనం నరకయాతన పడుతున్నారు. షాపింగ్‌ మాల్స్‌, కొన్ని దుకాణాలకు, సెల్లార్లకు పార్కింగ్‌ స్థలాలు లేకపోవడం వల్లే రోడ్డుకు ఇరుపక్క దుకాణాల ముందు, ఎక్కడ పడితే అక్కడే పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్య ఎదురౌతుందని వాహనదారులు, పాదాచారులు చెబుతున్నారు. ఈ విషయంలో పట్టించుకునే అధికారులే కరువయ్యారు. రోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, రైల్వే స్టేషన్‌ ఎదుట ఇష్టారాజ్యంగా నిలిపేయడంతో గంటల తరబడి ట్రాఫిక్‌స్తంభిస్తుంది. దీంతో ప్రయాణికులకు, ట్రాఫిక్‌ పోలీసులకు తలనొప్పిగా మారిందని వారు పేర్కొంటున్నారు. . ఇప్పటికైనా నూతన భవనాలు ఏర్పాటు చేసుకునే యజమానులు సెల్లార్‌ను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఉదయం, సాయంత్రం రోడ్లపై వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రైల్వే స్టేషన్‌ ముందు, తుకారాంగేట్‌, వారసిగూడకు వెల్లే ప్రాంతాలకు ఆటోడ్రైవర్లు రోడ్డుపై నిలిపేయకుండా ప్రజలకు సహకరించాలని కోరారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12859
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author