సల్లూ భాయ్ చిత్రంపై టెన్షన్

సల్లూ భాయ్ చిత్రంపై టెన్షన్
December 21 15:22 2017
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’విడుదల పై రాజకీయ వివాదం నెలకొంది. ఈ  సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబయి నగరానికి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేసిన హెచ్చరికలతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  మరాఠీ చిత్రమైన ‘దేవా ఎక్ అత్రంగీ’ సినిమా కూడా శుక్రవారం నాడు విడుదలవుతున్నందున ఈ చిత్రానికి సినిమా థియేటర్ల యజమానులు సల్మాన్ ఖాన్ సినిమాతో సమాన ప్రాధాన్యమిచ్చి థియేటర్లు కేటాయించి చిత్రం విడుదలయ్యేలా చూడాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆదేశించింది.   మరాఠీ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుంటే  పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఎంఎన్ఎస్  హెచ్చరించింది.  సినిమా థియేటర్ల యజమానులు మహారాష్ట్ర లోని భూమిలో థియేటర్లు నిర్మించి నడుపుతున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని ఒక లేఖ ను కుడా సేన విడుదల చేసింది. మరాఠీల మనోభావాలను గుర్తెరిగి తమ చిత్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని సేన అంటోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12862
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author