మెల్ బోర్న్ లో  ఓ కారు బీభత్సం

మెల్ బోర్న్ లో  ఓ కారు బీభత్సం
December 21 15:52 2017
మెల్ బోర్న్,
 ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో  ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫ్లిండర్స్ అండ్ ఎలిజబెత్ వీధిలో ఆ కారు జనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 15 మంది పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా బిజీగా ఉండే ఈ ప్రాంతంలో తెలుపు రంగు ఎస్యూవీ కారు జనంపైకి వేగంగా దూసుకు పోయింది. చివరకు  కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది ఓ ఉగ్ర చర్య అని అనుమానిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. రోడ్డు మీద నడుస్తూ వెళ్తున వారిపై కారు వేగంగా దూసుకువెళ్లలేదని పోలీసులు అంటున్నారు. ఆ వీధిలో జనం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఘటనతో అప్రమత్తమయిన అధికారులు మెట్రో ప్రయాణాలను కుడా నిలిపేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12871
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author