స్వాగతిస్తున్నాం : ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ

స్వాగతిస్తున్నాం : ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ
December 21 17:41 2017
హైదరాబాద్,
2 జీ కేసులో కోర్టు తీర్పును హర్షిస్తున్నాం..స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల క్రితం 2G స్కామ్ పై యూపీఏ పై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ, ఆర్రెస్సెస్ వాళ్ళు 2G స్కాంలో లక్షా 75వేల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. దీని పై కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న  రాజా, కనిమౌళి లకు సిబిఐ కోర్టు ఈ రోజు  క్లిన్ చిట్ ఇచ్చిందని అయన అన్నారు. బీజేపీ తమ సర్కార్ లో వచ్చిన ఆరోపణల పై సిబిఐ తో విచారణ చేసే దమ్ముందా అని అయన ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు అజయ్  షా, రాపెల్ , విజయ్ మాల్యా, అదాని, ముకేష్ అంబానీ తదితరుల ఆరోపణల పై సిబిఐ విచారణకు అదేశించండని అయన అన్నారు. సిబిఐ విచారణకు అదేశించి… మీ పాలన పారదర్శకంగా ఉందని నిరూపించుకోండని అన్నారు. మోడీ ప్రధానిగా ఉండి ఎన్నికల నియమావళిని పాటించలేదు. గుజరాత్ ఎన్నికల్లో మోడీ సెంటిమెంట్ తో పజలను రెచ్చగొట్టి ఓట్లేయించుకున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12883
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author