నేను ఐదేళ్లకు ఒకసారి కనిపించే వ్యక్తిని కాను

నేను ఐదేళ్లకు ఒకసారి కనిపించే వ్యక్తిని కాను
December 21 19:38 2017
జి.కొండూరు,
 ఐదేళ్లకోసారి ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో కనిపించే వ్యక్తిని కానని ఎల్లప్పుడూ, ప్రతిరోజు ప్రజల మధ్య ఉండే మనిషినని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. గురువారం మండలంలోని చెరువు మాధవరం, మునగపాడు, తెల్లదేవరపాడు, దుగ్గిరాలపాడు గ్రామాల్లో జరిగిన ఇంటింటికీ తెదేపా కార్యక్రమ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తాము ఎన్నికలకోసమో, ఓట్ల కోసమో రాలేదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికల లేవని సమస్యలను తెలుసుకునేందుకు పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికీ తెదేపా కార్యక్రమం నిర్ధేశించారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకే గ్రామాల్లో తాము ఈ పాదయాత్ర ను చేపట్టినట్టు చెప్పారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అందరికీ అందేలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు. రానున్న జన్మభూమి సభలు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా కు ఆయా గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12922
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author