వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న తిరుమల

వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న తిరుమల
December 21 21:38 2017
చిత్తూరు,
వైకుంఠ ఏకాదశినాడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడ్ని దర్శించుకోటానికి భక్తులు పోటీ పడుతుంటారు. ఏకాదశి, ద్వాదశీ రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఈ ద్వారాల్లో భక్తులు పాదాలు మోపితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తజనుల విశ్వాసం. అందుకే భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశినాడు శ్రీవారిని సందర్శించుకునేవారి సంఖ్య లక్షలాదిగా ఉంటుంది. ఇసుక వేస్తే రాలనంతా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నెల 29న వైకుంఠ ఏకాదశి,30 న ద్వాదశి పర్వదినాలు ఉండడంతో టిటిడి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. ప్రివిలేజ్ దర్శనాలన్ని రద్దు చేసింది. కాలిబాట భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, చట్టిబిడ్డాల దర్శనం, వికలాంగుల దర్శనం, సిఫారసు లేఖలను రద్దు చేసింది టిటిడి. విఐపి దర్శనాలను కుదించింది. ప్రోటోకాల్ పరిధిలోని వారికే విఐపి దర్శనాలు కేటాయిస్తామని అంటుంది.
ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావటంతో భక్తులు స్వామి వారిని దర్శించుకునే సమయం దాదాపు నాలుగు గంటలపాటు తగ్గిందని అంటున్నారు టిటిడి అదికారులు. శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళి ఈ ఏడాది శుక్రవారం నాడు ఏకాదశి వచ్చిందని దీంతో స్వామివారికి అభిషేకంతోపాటు విశేష తిరువాభరణాల అలంకరణ కూడా ఉంటుందని అంటుంది టిటిడి. స్వామివారికి ఏకాదశినాడు వజ్రాలతో కూడా బంగారు అభరణాలను అలంకరిస్తారు. దీంతో ఏకాదశినాడు ఉదయం 5.30 నిముషాలకు విఐపి దర్శనం ప్రారంభిస్తామని జేఈఓ శ్రీనివాసరాజ అన్నారు. ఉదయం 8 గంటల వరకు విఐపి దర్శనాలు ఉంటాయిని,8 గంటల నుండి సామన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభిస్తామని అంటున్నారు. తిరుమలకు వచ్చే విఐపిలకు నాలుగు అతిదిగృహాలలో వసతి, దర్శన ఏర్పాట్లు కౌంటర్లు ఏర్పాటు చేసామని అన్నారు. ఏకాదశి దర్శనం కావాలని వచ్చే భక్తులకు ముందు రోజు ఉదయం పది గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోకి అనుమతిస్తామని టిటిడి ప్రకటించింది. ఏకాదశీ ద్వాదశీ ఈ రెండు పర్వదినాలు ముగిసిన తర్వాత కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. జనవరి మొదటి తేదీ రద్దీని సైతం దృష్టిలో పెట్టుకుని అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12945
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author