అస్తవ్యస్తంగా కాఫీ సేకరణ

అస్తవ్యస్తంగా కాఫీ సేకరణ
December 21 22:27 2017
 విశాఖపట్నం,
విశాఖ మన్యం కాఫీకి మంచి ఆదరణ ఉంది. దీంతో కాఫీ పంటకు, సేకరణకు ప్రాధాన్యతనిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం కాఫీసాగుతో పాటు కాఫీగింజల సేకరణకు కష్టకాలం పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్‌ సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి కేటాయించిన ఉప ప్రణాళిక నిధుల విడుదలలోనూ సందిగ్ధం తలెత్తింది. దీంతో ఈ ఏడాది అసలు కాఫీ సేకరిస్తారా అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. కాఫీ పంట సాగు చేసే కాఫీ రైతులకు మార్కెట్‌ ధర కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థ సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. గిరిజనులు పండించే కాఫీని సేకరించి, దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా వాటికి మద్దతు ధర ప్రకటించి వారి పంటకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇంతవరకు బాగానే ఉన్నా జీసీసీ దీనిని మొక్కుబడి తంతుగా మార్చేయడంతో ప్రస్తుతం కాఫీ సేకరణకు గ్రహణం పట్టినట్టైంది.
జీసీసీ కాఫీ సేకరణ తొలి నుంచి అస్తవ్యస్తంగానే సాగుతోంది. నిబంధనలు ఒకలా ఉంటే అమలు తీరు మరో రకంగా ఉండటంతోనే సమస్య మొదలైంది. జీసీసీ సిబ్బంది దీనికి తలకుమించిన భారంగా భావించడం.. పర్యవేక్షణ తీరు సరిగా లేకపోవడంతో పథకం దారితప్పింది. కాఫీ పండించే గ్రామాల్లో ఎలక్ట్రానిక్‌ యంత్రాల ఏర్పాటుతో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి మాత్రమే జీఈసీ కాఫీ గింజలను సేకరించాలి. మన్యంలో ఎక్కువగా పండుతున్న పార్చ్‌మెంట్‌, చెర్రీ కాపీలను సేకరించి సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన కాఫీ గోదాములకు తరలించాలి. తరవాత శుద్ధి కేంద్రమైన నర్శీపట్నంకు తరలించి దేశీయ మార్కెట్‌లో వేలం వేసే వరకూ భద్రపరచాల్సిన భాద్యత జీసీసీదే. 2017-18 సంవత్సరానికి 1500 మెట్రిక్‌ టన్నులను జీసీసీ ద్వారా సేకరించాలని లక్ష్యాన్ని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో అపెక్సు కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించిన ధరను ప్రకటించేందుకు జీసీసీ సిద్దమవుతుంది. గత ఏడాది కంటే పకడ్బందీగా ఈ ఏడాది కాఫీ సేకరణ చేపడతామంటూ అధికారులు భీరాలు పలుకుతున్నప్పటికి ఇంతవరకు కాఫీకి గిట్టుబాటు ధర కూడా ప్రకటించకపోవడంపట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తవమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే విశాఖ మన్యంలో కాఫీ మరుగున పడిపోయే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12954
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author