యాదాద్రిలో ఘోర విషాదం..

యాదాద్రిలో ఘోర విషాదం..
December 22 10:44 2017
యాదాద్రి,
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో ఒకే ఇంట్లో ఏడుగురు మృతి చెందారు. స్థానికంగా ఈ ఘటన సంచనలం సృష్టించింది. స్థానిక ‘నాగభూషణం కోళ్ల ఫారం’ వద్ద ఉన్న ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఏడుగురి మృతదేహాలు కనిపించాయి. వారందరినీ ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు మృతుల్లో నలుగురు పెద్దవాళ్లు, ముగ్గురు చిన్న పిల్లలు  ఉన్నారు..  పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడ గ్రామానికి చెందిన బాలరాజు నెల రోజులుగా భార్య నిర్మల తో కలిసి రాజాపేటలోని నాగభూషణం కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. దీనికి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో భార్య, ముగ్గురు పిల్లలు, చింటూ, బన్నీ, శ్రావణీలతో కలిసి నివసిస్తున్నాడు. వీరిని చూసేందుకు గురువారం నిర్మల తల్లిదండ్రులు బాలనర్సయ్య(65), భారతమ్మరాజాపేట వచ్చారు.  అయితే తెల్లారేసరికి అందరూ మృతి చెంది ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే కుటుంబానికి చెందిన వీరంతా నిద్రలోనే ఎలా ప్రాణాలు కోల్పోయారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక, ఎవరైనా హత్య చేశారా? లేదంటే, ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగిందా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.రాత్రి తిన్న చికెన్ ఫుడ్ పాయిజన్ అయి వీరు మృతిచెంది ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12964
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author