రైతు పేరుతో రైతులకే..

రైతు పేరుతో రైతులకే..
December 22 11:16 2017
నిజామాబాద్,
నిజామాబాద్ జిల్లాలో ఏటా సుమారు 32 వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. సుమారు 7.2 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాలు ధర సగటున రూ.7 వేలు పలికితే రూ.500 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయి. నిర్మల్‌, జగిత్యాల ప్రాంతాల రైతులు ఇక్కడికే పంట తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పసుపు మార్కెట్‌గా గుర్తింపు పొందిన నిజామాబాద్‌ యార్డులో వ్యాపారుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి.సీజన్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి..సీజన్‌ ముగియగానే రైతుల రూపంలో మార్కెట్‌కు తీసుకొచ్చి లబ్ధిపొందుతున్నారు.
ఫిబ్రవరి నుంచి సరకు రావడం మొదలైతే మే నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు కొనసాగుతాయి. రోజుకు పదివేల లాట్‌లు (పంట కుప్పలు) వస్తుంటాయి. మార్కెట్‌కు సరకు పోటెత్తిన వెంటనే ఏటా ధరలు తగ్గుతున్నాయి. వ్యాపారులు కూటమి కట్టి ధరలను కూలదోస్తున్నారు. దీంతో చేసేదేమిలేక అడిగిన ధరకే అంటగడుతున్నారు.
సీజన్‌ ప్రారంభంలో ఫిబ్రవరి నుంచి మే వరకు 8.30 లక్షల క్వింటాళ్లు మార్కెట్‌కు వచ్చిన పసుపు మిగతా ఈ ఆరు నెలల్లో 1.20 లక్షల క్వింటాళ్లు మాత్రమే బయటకు వచ్చింది.
గిట్టుబాటు దక్కని పరిస్థితుల్లో నిల్వ చేసుకునేందుకు రైతులు సాహసించడం లేదు. 2009లో క్వింటాలు పసుపు ధర రికార్డు స్థాయిలో రూ. 16 వేలు పలికింది. మళ్లీ అందులో సగం దాటిన దాఖలాలు లేవు. గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో నిల్వ చేసుకున్న వారికి కొన్నిసార్లు పరాభవం ఎదురైంది. శీతల గిడ్డంగుల్లో పెట్టుకోవలసి వస్తుండడంతో నిర్వహణ వ్యయాన్ని తట్టుకోలేక చేతులేత్తేస్తున్నారు. ఉడికి ఆరబెట్టిన సరకు వెంటవెంటనే మార్కెట్‌కు తరలించి వచ్చిన ధరతో సంతృప్తి పడుతున్నారు.
పసుపు ఎకరం సాగు వ్యయం రూ. 1.20 లక్షలు ఉంటుంది. కనీసంగా రూ. లక్ష తక్కువ కాకుండా ఖర్చు చేస్తున్నారు. దిగుబడులు ఎకరానికి సగటున 20 క్వింటాళ్లు వస్తోంది. మార్కెట్‌లో ధర క్వింటాలుకు రూ. 8 వేలు ఉంటేనే గిట్టుబాటవుతుంది. ఈ లెక్కన రాబడి రూ. 1.60 లక్షలు వస్తుంది. ఖర్చులు పోనూ రూ. 40,000-50,000 మాత్రమే మిగులుబాటవుతుంది. ధర ఏమాత్రం తగ్గిన పెట్టుబడులు దక్కించుకోలేక, నష్టాలు మూటగట్టుకునే దుస్థితి ఏర్పడుతుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12979
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author