భారీగా తగ్గిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

భారీగా తగ్గిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
December 22 12:25 2017
అదిలాబాద్,
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ఉత్తరభారతం నుంచి వీస్తున్న శీతలగాలులకు ఈశాన్య రాష్ర్టాల చలిగాలులు తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజులుపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సోమ, మంగళవారాలతో పోలిస్తే బుధ, గురువారాల్లో చలి స్వల్పంగా తగ్గింది. సాధారణం కంటే ఒకటి డిగ్రీ తగ్గి 30 డిగ్రీలుగాను, కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలు తగ్గి 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మంల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 7 డిగ్రీలు తగ్గి 10 డిగ్రీలుగా నమోదయ్యాయి. మెదక్‌లో 10 డిగ్రీలు, రామగుండంలో 12, హకీంపేట్, హన్మకొండ, నిజామాబాద్‌లలో 13, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో 14 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13013
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author