మూడు జిల్లాల్లో బస్తాల దోపిడి

మూడు జిల్లాల్లో బస్తాల దోపిడి
December 22 12:28 2017
నిజామాబాద్,
మానవ వనరుల కొరత, తక్కువ సమయంలో ధాన్యం ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో రైతులంతా వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల అసలు పట్టాల అవసరం లేకుండానే ధాన్యం శుభ్రంగా వస్తుంది. రాళ్లు, మట్టి పెళ్లలు వచ్చే ప్రసక్తే లేదు. అయినా వ్యాపారులు అధిక తూకం పేరుతో రైతుల పంటను దోపిడీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తూకం రాళ్లలో అక్రమాలకు పాల్పడి ఇష్టానుసారంగా తూకం వేసి రైతులకు దొరికిన సందర్భాలు హుజూర్‌నగర్‌ ప్రాంతంలో కోకొల్లలు. రైతులు పండించిన పంటను సాధారణంగా బస్తాకు 70 కిలోలు తూకం వేస్తారు. సంచితో కాంటా వేస్తారు కనుక, దాని బరువు కింద కిలోతో కలిపి మొత్తం 71 కిలోలు తూకం వేయాలి. చాలాచోట్ల వ్యాపారులు 72 కిలోలు తూకం వేస్తున్నారు. మరో కిలో ఎందుకు అంటే కళ్లాల వద్దనే ధాన్యం కాంటా వేస్తారు కనుక.. ధాన్యంలో రాళ్లు, పెళ్లలుచెప్పి తరుగు కింద అదనంగా కిలో తూకం వేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. వాస్తవానికి రైతులు చదును చేసే కళ్లాలను తయారుచేస్తారు. దీనివల్ల ధాన్యంలోకి రాళ్లు, మట్టి పెళ్లలు వచ్చే అవకాశం తక్కువ. ఇపుడు అన్ని ప్రాంతాల కళ్లాల్లో పట్టాలు వేస్తున్నారు. మూడు జిల్లాలో ధాన్యాన్ని ఎక్కువగా మూసీ, కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో పండిస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో మూడు జిల్లాల్లో కలిపి సుమారు అయిదు లక్షల ఎకరాలలో వరిని సాగు చేసినట్లు అంచనా. ఎకరాకు సగటున 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది అనుకుంటే.. మార్కెట్‌లో కొనుగోళ్లు పోను దాదాపు 60 లక్షల బస్తాల ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కల్లాల వద్ద, మిల్లుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది కిలో తరుగు తీస్తున్నారు. అలా తీయటం వల్ల సన్నరకాల ధాన్యం బస్తా(77 కిలోలు) రూ.1600 కొంటున్నారు. క్వింటాలుకు రూ.2,130 పడుతుంది. అందులో తరుగు కింద రూ.21.30 పోతుంది. అంటే రైతుకు అసలు పడుతున్న ధర రూ.2,108.70 మాత్రమే. వాస్తవానికి ఇస్తున్నట్లు అన్పించేది మాత్రం రూ.2,130. అంటే ప్రతి బస్తాకు రైతులు నష్టపోతుంది రూ.21.30. దాదాపు ఈ లెక్కన ప్రతి సీజన్‌లో దాదాపు రూ.13.50 కోట్లకు పైగా రైతులు నష్టపోతున్నారు. ఈ దందా సాగర్‌ ఆయకట్టు ప్రాంతాలలో చాలా చోట్ల ఉంది.దందా ఎక్కువగా ఖరీఫ్‌లోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో రైతులు అధికంగా సన్నరకాలు పండిస్తారు. బయట మార్కెట్‌లో వీటికి అధిక ధర ఉంటుంది. వాస్తవానికి అధిక ధర వల్ల రైతులు లాభపడాలి. కాని వచ్చిన అధిక ధర తరుగు పేరుతో దోచుకోవటం వల్ల వారికి దక్కేది తక్కువే. సన్నరకాలకు మార్కెట్‌లో గ్రేడ్‌-ఏ రకానికి క్వింటాలుకు రూ.1590 ఉండగా, బయట మార్కెట్‌లో రూ.2,130 ఉంది. ఆ మొత్తం రైతులకు అందకపోవటం వల్ల లాభదాయకమైన పంట పండించినా కూడా రైతులకు రావాల్సిన ధర రావటంలేదు. అధిక తూకాలు వేసి తమను మోసం చేస్తున్నారని గతంలో అనేక సార్లు అన్నదాతలు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మిల్లర్లు, ధాన్యం వ్యాపారులను పిలిపించి మాట్లాడం తప్ప వారిపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13016
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author