రోడ్డు మీదు బస్సులు

రోడ్డు మీదు బస్సులు
December 22 13:32 2017
ఏలూరు
ఆ ఊరు… రాష్ట్రంలోని బాస్కెట్ బాల్ క్రీడకు పేరున్న విలేజ్. చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లాలంటే మాత్రం ఆ విలేజ్ పెద్ద సెంటర్. ఈ సెంటర్ ఆటోమొబైల్ ఇండ్రస్టీకి పెద్ద పేరు… ఆయినా ఆ మేజర్ పంచాయతీ గ్రామంలో ఒక్కటే లోటు.  ప్రతిరోజూ వేల సంఖ్యలో జనం ప్రయాణం చేస్తున్నా అక్కడ మాత్రం,….బస్టాండ్ ను శిథిల కూపంగా మార్చేశారు అధికారులు.పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం. రాష్ట్రంలోనే పెద్ద పేరున్న గ్రామం. ఎందుకంటే ఇక్కడ  బాస్కెట్ బాల్ నేషనల్ క్రీడాకారులు ఉన్నారు.  ఒకప్పటి మారుతీపురంగా పేరున్నా …ఇప్పుడు మార్టేరుగా మారింది.  ఆటో పరిశ్రమకు పెద్ద పేరే ఉంది ఈ గ్రామానికి.  ఈ గ్రామం నుంచే పాలకొల్లు… పెరవలి మీదుగా నిడదవోలు వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ఇక్కడ నుంచే చుట్టుపక్కల ఉన్న దాదాపు 500 గ్రామాలకు ప్రయాణానికి మెయిన్ సెంటర్. ఇంత పేరున్న ఇక్కడ బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నిల్చోడానికి, కూర్చోడానికి కూడా ఏమీలేక ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం ఇంటికి చేరుకునే వరకూ ఇదే పరిస్థితి ఎదుర్కోవలసివస్తుంది. ఆచంట నియోజకవర్గంలో ఇదొక ప్రధానమైన నాలుగు రోడ్లు కలిసిన సెంటర్. ఒక వైపున తాడేపల్లిగూడెం రోడ్డు, మరొక వైపున పాలకొల్లు రోడ్డు, ఇంకొక వైపున నిడదవోలు రోడ్డు, ఇంకోవైపు ఆచంట రోడ్డు ఇలా నాలుగు రోడ్లు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధానమైన సెంటర్ ఈ మార్టేరు సెంటర్. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే ప్రయాణం చేయాలి. కానీ ఇక్కడ ప్రయాణికులకు కనీసం నిలబడటానికి గానీ, కూర్చోడానికి గానీ ఏమీ లేని పరిస్థితి. ఇక్కడ ప్రయాణికులకు టాయిలెట్లు కూడా లేకపోవడంతో కాలేజీ విద్యార్ధుల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని అర్థం చేసుకుని త్వరితగతిన ఇక్కడ ప్రయాణికులకు బస్‌షెల్టర్‌ను, టాయిలెట్స్‌ను ఏర్పాటుచేయాలని మార్టేరు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13043
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author